సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలుబొమ్మగా మారారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు కుల, మత, రాజకీయాల కతీతంగా పని చేయాలని హితవు పలికారు. నిమ్మగడ్డ రమేష్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..)
దోషులను కఠినంగా శిక్షిస్తాం: పుష్పశ్రీవాణి
విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతల దాడి దుర్మార్గమని, రామతీర్థం ఘటనకు బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షిస్తామని పుష్పశ్రీవాణి తెలిపారు.(చదవండి:అయ్యో... రామ‘చంద్ర’!)
Comments
Please login to add a commentAdd a comment