
సాక్షి, తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నోటికొచ్చినట్లు నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాయి ఎక్కడ.. లేకేష్ స్థాయి ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీఎం వైఎస్ జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నారని కన్నబాబు తెలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల వైఖరేంటో స్పష్టం చేశాకే తిరుపతి సభను నిర్వహించాలని అన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రతిగడపకు తీసుకునిపోతుందని అన్నారు. ప్రజలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే దిగజారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ ఛాలెంజ్‌లు చూస్తుంటే కామెడీ చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment