వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రులు కాకాణి, అమర్‌నాథ్‌ | Ministers Kakani Govardhan and Gudivada Amarnath who met Vemireddy Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రులు కాకాణి, అమర్‌నాథ్‌

Published Thu, Apr 21 2022 8:04 AM | Last Updated on Thu, Apr 21 2022 8:04 AM

Ministers Kakani Govardhan and Gudivada Amarnath who met Vemireddy Prabhakar Reddy - Sakshi

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సాక్షి, కోవూరు (నెల్లూరు): రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని మండలంలోని వేగూరులో అతిథి గృహంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నియమితులు కావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.   



వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రి అమర్‌నాథ్‌ 
నెల్లూరు(సెంట్రల్‌): రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్‌ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం నెల్లూరులోని వేమిరెడ్డిని ఆయన  నివాసంలో మంత్రి అమర్‌నాథ్‌ కలిసి బొకే అందజేసి శాలు వాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి తదితర అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. 

చదవండి: (YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్‌ రెడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement