డుంబ్రిగుడ: భిన్న ఆలోచనలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవ్వడంతో ఇద్దరు రైతు మిత్రులు లాభలబాటలో పయనిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీ దేముడువలస గ్రామానికి చెందిన త్రినాథ్, పాంగి తిరుపతిలు బావబావమరుదులు. వీరిద్దరూ ఆరెకరాల విస్తీర్ణంలో బీన్స్, వంకాయ, బీరకాయ, మిరప , కాకరకాయ, క్యాబేజి, మొక్కజొన్న సాగు చేపట్టారు.
పూర్తిగా సేంద్రియ ఎరువులు వారే స్వయంగా తయారు చేయడంతోపాటు తోటి రైతులకూ అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే స్థానిక వ్యవసాయాధికారుల సహకారంతో ఐదేళ్లుగా అనేక రకలైన కూరగాయలను సాగు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే అంతర పంటలు సైతం సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
సొవ్వ టు వైజాగ్
ఈ పంటలను విశాఖలోని వివిధ రైతు బజార్లకు, అరకు వారపు సంతలకు ప్రతి వారం 30 టన్నుల నుంచి 50 టన్నుల వరకు విక్రయాలు చేస్తుంటారు. కాలంతో సంబంధం లేకుండా నిత్యం కూరగాయలు పండిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. పశువుల పేడ, మూత్రం వినియోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. అలాగే వేప కషాయం తయారు చేసి పంటలకు పిచికారి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment