సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేదు.. రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో ఎలాంటి సంబంధం లేదు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నాం.. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తాం’’ అంటూ కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.
అయితే ఆర్థికమంత్రి సీతారామన్ లేఖపై పచ్చ మీడియా విషప్రచారం చేసింది. రాష్ట్రంతో కేంద్రం సంప్రదింపులు జరిపిందంటూ అబద్దాల ప్రచారం చేసింది. స్టీల్ ప్లాంట్ అంశంలో అవసరమైనప్పుడు మాత్రమే చర్చల జరుపుతామని నిర్మలా సీతారామన్‌లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో రాష్ట్రప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టం చేశారు. కానీ ఎల్లో మీడియా ఈ లేఖపై తప్పుడు ప్రచారం చేసింది. కుట్ర ప్రకారం రాష్ట్రప్రభుత్వంపై ఎల్లో మీడియా బురద జల్లేందుకు యత్నించింది.
Comments
Please login to add a commentAdd a comment