చంద్రబాబు రాజమహల్‌లో ఉంటూ జగన్‌పై ఆరోపణలా?:పేర్ని నాని ఆగ్రహం | Perni Nani Fires On Chandrababu And Yellow Media Over False Propaganda | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజమహల్‌లో ఉంటూ జగన్‌పై ఆరోపణలా?:పేర్ని నాని ఆగ్రహం

Published Tue, Jun 25 2024 5:25 PM | Last Updated on Tue, Jun 25 2024 6:15 PM

Perni Nani Fires On Chandrababu And Yellow Media Over False Propaganda

చంద్రబాబు సెక్యూరిటీకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందో చెప్పాలి

2014 నుండి 2019 వరకు చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో ప్రకటించాలి

రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు కూడా బ్లాక్ క్యాట్ కమాండోలను కోరిన వ్యక్తి చంద్రబాబు

చంద్రబాబు మనమడికి కూడా 4+4 గన్ మెన్లను ఇచ్చారా? లేదా?

అంటే చంద్రబాబు ఫ్యామిలీవే ప్రాణాలా? జగన్‌ ఫ్యామిలీవి ప్రాణాలు కాదా?

ఎల్లో మీడియాపై పేర్ని నాని ధ్వజం

సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ఖండించారు.  ఈ మేరకు మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. వారి మానసిక నైజం ఈ వార్తల ద్వారా బయట పెడుతున్నారు..  వైఎస్‌ జగన్‌ భద్రత కోసం 986 మంది సెక్యూరిటీ అంటూ తప్పుడు వార్తలు రాశారు. అవన్నీ అవాస్తవాలే’ అని మండిపడ్డారు.

పేర్ని నాని ఏమన్నారంటే..

  • ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి
  • వారి మానసిక నైజం ఈ వార్తల ద్వారా బయట పెడుతున్నారు
  • జగన్ సీఎంగా  ఉన్నప్పుడు భద్రత కోసం 986 మంది సెక్యూరిటీ అంటూ తప్పుడు వార్తలు రాశారు
     
  • ఆర్మ్వడ్ ఫోర్స్ 33
  • AP స్పెషల్ ఫోర్స్ 89
  • ఆక్టోపస్ 13
  • ఇతర పోలీసులు 23
  • కాన్వాయ్ కి 21 మంది
  • 196 మంది మొత్తం పని చేస్తారు
     
  • బెంగళూరులో జగన్‌కి సెక్యూరిటీ లేదు
  • హైదరాబాదు నివాసం బయట పోలీసులు రెస్టు తీసుకోవటానికి రేకుల షెడ్ వేసుకున్నారు
  • చంద్రబాబు, రోశయ్య, ఎన్టీఆర్, జనార్ధనరెడ్డి ఇలా అందరి సీఎంల దగ్గర బ్యారెక్‌లు పెడతారు
  • అది పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులే చేస్తారు
  • దానికి జగన్‌కి సంబంధం ఏమిటి?
  • రామోజీ కొడుకు ఈ వాస్తవాలను పక్కనపెట్టి తప్పుడు వార్తలు రాశారు
  • చంద్రబాబు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపవద్దని చెప్పాడని తప్పుడు వార్తలు రాశారు
  • నాతో వస్తే ట్రాఫిక్ ఆపుతున్నారో లేదో చూపిస్తా
  • ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరైనా చంద్రబాబు కాన్వాయ్ ఆగిందా?
  • కానీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు వేస్తూనే ఉన్నాయి
  • చంద్రబాబు సెక్యూరిటీకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందీ చెప్పాలి
  • 2014 నుండి 2019 వరకు చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో ప్రకటించాలి
  • రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు కూడా బ్లాక్ క్యాట్ కమేండోలను పంపాలని కోరిన వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు మనమడుకి కూడా 4+4 గన్ మెన్లను ఇచ్చారా? లేదా?
  • అంటే చంద్రబాబు ఫ్యామిలీవే ప్రాణాలా? జగన్ వి ప్రాణాలు కాదా?
  • జగన్ ఇంటిముందు రోడ్డును ఆపేశారంటూ వార్తలు రాశారు
  • మరి కరకట్ట మీద 2014 నుండి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఎందుకు రానివ్వలేదు?
  • సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగకుండా బెదిరించి జగన్ ఇంటిముందు రోడ్డును తెరిచారు
  • హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇళ్లు విలువ ఎంత? జగన్ ఇంటి విలువ ఎంతో తేల్చాలి?
  • చంద్రబాబు, జగన్ ఇళ్లలోని ఫర్నీచర్ విలువ ఎంతో ఆడిట్ చేయించాలి
  • చంద్రబాబు ఇంటి ఫోటోలను బయటి ప్రపంచానికి ఎందుకు చూపటం లేదు?
  • చంద్రబాబు రాజమహల్‌లో ఉంటూ జగన్ పై ఆరోపణలు చేస్తారా?
  • ఎన్టీఆర్ వయాగ్రా వాడుతున్నారని కూడా వార్తలు రాయించిన ఘనత చంద్రబాబుది
  • ఎంతటివారినైనా వ్యక్తిత్వ హననం చేయటం చంద్రబాబు, ఫేక్ ఫ్యాక్టరీలకు అలవాటే
  • కృష్ణానదిలో దిగి చంద్రబాబు కాళ్లు కడుక్కోవటానికి కూడా  జనం సొమ్ముతో నిర్మాణాలు చేశారు
  • రైతుల పొలాల్లో అడ్డగోలుగా హెలిఫ్యాడ్ నిర్మాణాలు ఎందుకు చేశారు?
  • జగన్ ఇంటి చుట్టూ ఇళ్లు ఉన్నందునే సెక్యూరిటీ కోసం ఐరెన్ గ్రిల్స్ ఏర్పాటు చేయటం తప్పేంటి?
  • జగన్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నీచర్ తీసుకెళ్లమని లెటర్ రాస్తే ఇంతవరకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు?
  • చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే వైసీపి ఆఫీసులకు స్థలాలు కేటాయించారు
  • చంద్రబాబు తన కార్యాలయాలన్నిటినీ ఎకరం వెయ్యి రూపాయలకే కేటాయించుకున్నారు
  • ఆ సంగతిని ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?
  • మంగళగిరి ఆఫీసుని కూడా వెయ్యి రూపాయలకే తీసుకున్నారు
  • హైదరాబాదులో పార్టీ ఆఫీసు కోసం స్థలం తీసుకుని దాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ గా ఎందుకు మార్చారు?
  • మంగళగిరి ఆఫీసు నిర్మాణానికి ఏం అనుమతులు ఉన్నాయో చూపించాలి
  • కాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, వైజాగ్.. ఇలా అనేక ప్రాంతాల్లో నిర్మించిన మీ పార్టీ ఆఫీసులు రేకుల షెడ్డులా?
  • ఒక్క హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసే వందల కోట్ల విలువైనది
  • నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబు వ్యవహరించినా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు కనపడటం లేదా?
  • జగన్ బెంగుళూరు వెళ్తే కూడా తప్పుడు వార్తలు రాస్తున్నారు
  • డీకే శివకుమార్ తో చర్చించినట్టు కూడా తప్పుడు వార్తలు రాశారు
  • సోనియా, చంద్రబాబు కలిసి జగన్ని 16 నెలలు జైల్లో పెడితేనే లొంగలేదు
  • అలాంటిది ఇప్పుడు పార్టీని విలీనం చేస్తారా?
  • జగన్ పై ఎన్ని తప్పుడు వార్తలు రాసినా, కార్యకర్తలపై దాడులు చేసినా ఆయన బెదరడు
  • తాడేపల్లి నుండే అయన తన పోరాటం చేస్తారే తప్ప భయపడి వెనుకడుగు వేయడు
  • చంద్రబాబు రోజూ ప్రవచనాలు చెప్తున్నట్టు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది
  • 65% మంది ప్రజలు చూసే సాక్షిటీవీ సహా మరో రెండు ఛానల్స్ ని రాకుండా అడ్డుకున్నారు
  • వాస్తవాలను చూపించే ఛానల్స్ ని ఆపేసి చంద్రబాబు ప్రవచనాలు చెప్తున్నారు
  • హైకోర్టు ఆదేశాలతో ఆ ఛానల్స్ అన్నీ తిరిగి టెలికాస్ట్ చేయల్సిందే
  • లేకపోతే కోర్టు ధిక్కరణ కేసులు వేస్తాం
  • చంద్రబాబు ఇంటి పక్కన, వెనుక, భవానీద్వీపంలో ఎంతమంది పోలీసులు కాపలా కాస్తున్నారో లెక్కలు తీయాలి
  • ఎన్.ఎస్.జీ. కమాండోలు, రాష్ట్ర పోలీసులు ఎంతమంది ఉన్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి
  • వైఎస్సార్‌సీపీ ఆఫీసుల నిర్మాణాలన్నీ మా పార్టీ ఖర్చులే
  • అమరావతి నిర్మాణ కాంట్రాక్టర్ తో మంగళగిరి ఆఫీసు కట్టించినట్టు మేం చేయటం లేదు
  • హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మించిన వారితో అక్కడ పార్టీ ఆఫీసు కట్టలేదు
  • టీడీపీ ఆఫీసుల ఫైళ్లు తీసుకుని వస్తే, వైసీపి ఆఫీసు ఫైల్స్ కూడా తీసుకుని వస్తాం
  • సెక్రటేరియట్ లో కూర్చుని చర్చిద్దాం
  • ఆ దమ్ము టీడీపీకి ఉందా?
  • 2019లో తమ్మినేని సీతారాంని స్పీకర్ గా ఎన్నుకున్నప్పుడు టీడీపీ వారు అసెంబ్లీలో ఉన్నారా?
  • ఆయన్ను స్పీకర్ ఛెయిర్ లో కూర్చోపెట్టేందుకు ఎందుకు రాలేదు?
  • జగన్ని చచ్చేదాకా కొట్టాలనే వ్యక్తిని స్పీకర్ చేయటం మాకు నచ్చలేదు
  • అందుకే బాయ్ కాట్ చేశాం
  • బందరులో కాకుండా ఇక ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా నా కుటుంబ సభ్యుల పేరుతో ఇళ్లు ఉంటే ఆధారాలు చూపండి
  • వెంటనే ఆ ఆస్తినంతా వారికే రాసిస్తా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement