సాక్షి, గుంటూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సత్కరించిన సంగతి తెలిసిందే. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. దీనిపై పింగళి వెంకయ్య మనవళ్లు హర్షం వ్యక్తం చేశారు. తమ తాతగారికి భారత రత్న ఇవ్వాలంటూ సీఎం జగన్, ప్రధానికి లేఖ రాయటం గొప్ప విషయమని.. అది సీఎం మంచితనానికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా పింగళి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పింగళి వెంకయ్య మనవళ్లు గోపి కృష్ణ, నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతో గడపడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తారని మా అమ్మగారిని సన్మానిస్తామని మేం ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్ మా అమ్మ గారిని సన్మానించడం ఆనందంగా ఉంది. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి, ముఖ్యమంత్రి లేఖ రాయడం ఒకవైపు ఆశ్చర్యాన్ని.. మరోవైపు ఆనందాన్ని కలిగిస్తోంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment