Pingali Venkaiah
-
మన మువ్వన్నెల జెండా ఆవిర్భవించింది ఏ రోజో తెలుసా!
‘‘ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ప్రతి మనసు ఉప్పొంగ మువ్వన్నెల మన జెండా పుట్టింది నేడు మన జాతి గుర్తుగా ఏప్రియల్ 1 శుభదినము అనుచు’’ ‘‘మన జెండా పుట్టిన రోజును భారతీయులుగా మనందరం పండుగ చేసుకుందాం’’ అని పిలుపునిస్తున్నారు కె.హెచ్.ఎస్. జగదంబ. రామ్‌నగర్ గుండులో నివసిస్తున్న ఈ జాతీయతావాది ఇంట్లో గోడలన్నీ దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టే బాధ్యతను మోస్తుంటాయి. ఎనభై ఆరేళ్ల వయసులో ఆమె టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గురించి సేకరించిన విషయాలను పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాస్తూ ఉంటారు. స్త్రీ శక్తి పురస్కార గ్రహీత జగదంబ. ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నానికి చెందిన జగదంబ పెళ్లి చేసుకుని 1952లో హైదరాబాద్‌కి వచ్చారు. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్‌లో మహిళాసాధికారత కోసం పని చేశారు. యాభై ఏళ్ల కిందటే ఆమె ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టి మహిళలకు మార్గదర్శనం చేశారు. గడచిన పాతికేళ్లుగా ఆమె జాతీయ పతాక రూపశిల్పి, జాతీయ పతాకం రూపుదిద్దుకున్న వైనం పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆది, సోమవారాల్లో(మార్చి 31, ఏప్రిల్ 1న) తాను నిర్వహించనున్న జెండా పుట్టిన రోజు పండుగ కోసం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె తన మనోభావాలను పంచుకున్నారు. పెన్షన్ తీసుకోమన్నారు! ‘‘పింగళి వెంకయ్య కుటుంబం అనేక ఇబ్బందులు పడుతున్న విషయం పాతికేళ్ల కిందట కాకతాళీయంగా నా దృష్టికి వచ్చింది. పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో నాకు తెలిసిన ఎవరో మా పరిశ్రమకు వచ్చి ఒక మాట చెప్పారు. ‘ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలనుకుంటోంది. మీరు దరఖాస్తు చేసుకోండి’ అన్నారు. ‘మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి నాకు పదేళ్లుంటాయో లేదో. నేను జాతీయోద్యమంలో పాల్గొనలేదు, అబద్ధపు దరఖాస్తు చేసుకోను’ అని చెప్పి పంపేశాను. అప్పుడు మా పరిశ్రమలో పని చేస్తున్న ఒక మహిళ నా దగ్గరకు వచ్చి తన పేరు రాయించమని అడిగింది. వివరాల్లోకి వెళితే ఆమె పింగళి వెంకయ్య గారి సమీప బంధువు. జెండా రూపుదిద్దుకున్న రోజుకి గుర్తింపు ఏదీ..? ఆమె మాత్రమే కాదు, పింగళి వెంకయ్య గారి పిల్లలు కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి నిర్ఘాంత పోయాను. ఆ క్షణంలోనే అనేక ప్రశ్నలుద్భవించాయి. భారత జాతిత్రయం! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును వేడుక చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని గౌరవించుకుంటున్నాం. కానీ భారత జాతికి ప్రతీక, భారతీయులందరికీ గర్వకారణమైన జాతీయ పతాకం రూపొందించుకున్న రోజు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకోవడం లేదు. మన జాతిపిత గాంధీజీ పుట్టిన రోజును గుర్తు చేసుకుంటున్నాం. తొలి ప్రధాని నెహ్రూకి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం. జాతీయ పతాక రూపకర్త పుట్టిన రోజును ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాం. ఇలా ప్రశ్నలతోపాటు నాలో ఆవేశం ఒక్క ఉదుటున తన్నుకొచ్చింది. అప్పటి నుంచి పింగళి వెంకయ్య గారి సమగ్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ‘శ్రీ పింగళి వెంకయ్య ఛారిటబుల్ ట్రస్ట్ మరియు స్మారక సంస్థ’ స్థాపించి ఆయన పుట్టిన రోజు ఆగస్టు 2వ తేదీ, జాతీయ పతాకం పుట్టిన రోజు మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో స్కూలు పిల్లలకు జాతీయ పతాకం ప్రాధాన్యం, పతాకం రూపుదిద్దుకున్న వివరాలను తెలియచేయడంతోపాటు చిన్న చిన్న పోటీలు పెట్టి బహుమతులివ్వడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టాను. పార్లమెంట్లో తీర్మానం ప్రవేశ పెట్టించగలిగాను. పింగళి వెంకయ్య గారి సేవలను ప్రచారం చేసుకోవడానికి అనుమతి వచ్చింది. పోస్టల్ స్టాంపు విడుదల వరకు చేయంచగలిగాను. సెలవు ప్రకటించడం సాధ్యం కాదన్నారు. పర్వదినాలుగా ప్రకటన కోసం పోరాడుతున్నాను. నా వంతుగా ఏటా జెండా పుట్టిన రోజు వేడుకగా నిర్వహిస్తున్నాను. మన జెండా పుట్టిన రోజు! అది 1921 మార్చి 31వ తేదీ. విజయవాడ, గాంధీ నగర్లో రెండు రోజుల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు గాంధీజీ అధ్యక్షతన మొదలయ్యాయి. దేశనాయకులు, రాష్ట్ర నాయకులతోపాటు జాతీయోద్యమంలో పాల్గొంటున్న దేశభక్తులు దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. పింగళి వెంకయ్య లెక్చరర్‌గా బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉద్యోగం చేసేవారు. ఆయన కూడా ఆ సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. ఆ సమయంలో గాంధీజీ ‘వెంకయ్య దేశదేశాల జాతీయ పతాకాల మీద అధ్యయనం చేసి ఉన్నారు. విద్యార్థులకు ఆయా దేశాల పతాకాల గురించి సమగ్రంగా వివరిస్తుంటారు. మనదేశం కోసం పతాకాన్ని రూపొందించే బాధ్యత చేపడితే బాగుంటుంది’ అన్నారు. అలా అడిగిన రోజు ఏప్రిల్ 1. గాంధీజీ అడిగిన మూడు గంటల్లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి, రంగులకు భావాన్ని, భాష్యాన్ని చెప్పారు. సభ ఆమోదం పొందడం, అధికారికంగా ప్రకటించడం అదే రోజు జరిగిపోయాయి. అలా 2021లో జెండా పుట్టిన వందేళ్ల పండుగ ఘనంగా నిర్వహించాను. ఈ ఏడాది ‘103వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సం’ వేడుకలను మార్చి 31వ తేదీన హైదరాబాద్, అంబర్‌పేట, వెంకటేశ్వర నగర్లో ఉన్న ‘పూర్ణ శాంతిశీల హోమ్స్’లో నిర్వహిస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీమతి భారతీయం సత్యవాణి గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఏప్రిల్ 1న కార్యక్రమాలను రామ్ నగర్ గుండులోని ట్రస్ట్ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించనున్నాం’’ అని వివరించారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదంబ. గమనిక: ఇక ప్రతి ఏటా జూలై 22 జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నాం. అది భారత జాతీయ జెండాగా స్వీకరించిన రోజు జులై 22,1947. ఇది జాతీయ పతాకం రూపుదిద్దుకున్న రోజు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
పింగళి 146వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
పింగళి వెంకయ్య 146వ జయంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. pic.twitter.com/tcYgSK5Ep3 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2022 కాగా ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, పల్నాడు: జాతీయ జెండా రూపకర్త దివంగత పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు న్నారు. గత ఏడాది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మాచర్లకు వచ్చి ఆమెను సత్కరించి రూ.75 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. కాగా, పింగళి సీతామహాలక్ష్మీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. -
TANA: పింగళి వెంకయ్య కుమార్తెకు సన్మానం
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సన్మానించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గుంటూరు జిల్లా మాచర్లలోని సీతామహాలక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెను పరామార్శించారు. ఆ తర్వాత తానా తరఫున జ్ఞాపిక అందించి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సంధర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయులందరూ మన త్రివర్ణ పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడిస్తూ.. భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుపుకునేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. ఈ తరుణంలో భారత జాతీయ పతాక రూపకల్పన జరిగి 100 ఏళ్లు పూర్తైన సంధర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సన్మానించామన్నారు. ఈ సన్మానం తన తండ్రికే స్వయంగా జరిగినట్టు భావిస్తున్నట్లు సీతామహాలక్ష్మీ స్పందించారు. తానాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డు సభ్యులు జనార్ధన్ నిమ్మలపూడి, పింగళి వెంకయ్య మనుమడు జీవీఎన్ నరసింహంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, మాచర్లలోని మీనాక్షి కంటి ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: సీఎం జగన్
-
పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సీఎం జగన్ ‘‘భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన.. పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి’’ అంటూ ట్వీట్ చేశారు. భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి. #PingaliVenkayya — YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2021 -
అది సీఎం జగన్ మంచితనానికి నిదర్శనం: పింగళి మనవళ్లు
సాక్షి, గుంటూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సత్కరించిన సంగతి తెలిసిందే. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. దీనిపై పింగళి వెంకయ్య మనవళ్లు హర్షం వ్యక్తం చేశారు. తమ తాతగారికి భారత రత్న ఇవ్వాలంటూ సీఎం జగన్, ప్రధానికి లేఖ రాయటం గొప్ప విషయమని.. అది సీఎం మంచితనానికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా పింగళి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య మనవళ్లు గోపి కృష్ణ, నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో గడపడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తారని మా అమ్మగారిని సన్మానిస్తామని మేం ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్ మా అమ్మ గారిని సన్మానించడం ఆనందంగా ఉంది. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి, ముఖ్యమంత్రి లేఖ రాయడం ఒకవైపు ఆశ్చర్యాన్ని.. మరోవైపు ఆనందాన్ని కలిగిస్తోంది’’ అన్నారు. చదవండి: పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వండి: సీఎం జగన్ -
పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ సత్కారం
-
ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ
-
సీఎం జగన్‌ను చూసి ఉద్వేగానికి లోనైన పింగళి వెంకయ్య కుటుంబం
-
పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లలో పర్యటించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లకు వెళ్లి వారిని సన్మానించారు. సీఎం జగన్‌ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్‌తో కలిసి పంచుకున్నారు. సీఎం వైఎస్ జగన్.. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం తిలకించారు. జగన్ సీఎంగా కాదు.. ఒక ఆత్మీయుడిగా.. జగన్ సీఎంగా కాదు.. ఒక ఆత్మీయుడిగా పలకరించారని పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అన్నారు. సీఎం జగన్ పలకరింపుతో వందేళ్ల ఆయుష్షు వచ్చిందన్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా పింగళి వెంకయ్య అందించారని, తండ్రిగా పింగళి వెంకయ్య తనను గాంధీకి పరిచయం చేశారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. భారత రత్న ఇవ్వండి పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. చదవండి: 'అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం పండుగలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు మాచర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాచర్లకు వెళ్లి వారిని సత్కరించనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 11.35 గంటలకు మాచర్ల చేరుకుంటారు. 11.45 గంటలకు మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీలోని పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళతారు. ఆమెను, ఇతర కుటుంబసభ్యులను ఘనంగా సన్మానిస్తారు. అనంతరం అక్కడినుంచి బయల్దేరి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: (నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా) -
అల్లూరి, పింగళికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి,అమరావతి: జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘మన జాతీయ పతాక రూపశిల్పి.. స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్యగారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యగారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. (చెరకు రైతుల బకాయిలు తీర్చాలి) అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. ‘గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి.. దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. -
మన దేశం
జాతీయ చిహ్నాలతో, వాటి వెనుక తాత్వికతతో పౌరులకు మానసిక బంధం ఉంటుంది. జాతి గతాన్ని వర్తమానంతో భావైక్యం చేయించేవే జాతీయ చిహ్నాలు. నిరుడు కురిసిన జ్ఞానధారలలో తడిసేటట్టు చేసేవి కూడా అవే. భిన్న సంస్కృతుల, భాషల నిలయాలుగా ఉండే పెద్ద దేశాలలో ప్రజలందరి మధ్య దూరాలను తగ్గించేవీ, దేశ భౌగోళిక స్వరూపంతో జాతి జనులను మమేకం చేసేవీ జాతీయ చిహ్నాలు. చరిత్ర నుంచి మాత్రమే కాదు, శతాబ్దాల జ్ఞానఖనుల నుంచే కాదు, ఉద్యమాలూ, త్యాగాలూ మిగిల్చిన గొప్ప జ్ఞాపకాల నుంచి కూడా జాతీయ చిహ్నాలు ఆవిర్భవిస్తాయి. కొన్ని ప్రకృతి ప్రసాదించిన జాతీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. అలాంటి మన జాతీయ చిహ్నాలే ఈవారం ‘వివరం’. భిన్నమైన ఉద్యమంతో, అనితర సాధ్యమైన పంథాతో స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశం అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన జాతీయ చిహ్నాలను ఎంచుకుంది. నీలిరంగు ధర్మచక్రంతో ఉండే మూడు రంగుల జెండా మన జాతీయ పతాకం. నాలుగు సింహాల అశోకచక్రం మన జాతీయ చిహ్నం. రాజసానికి ప్రతీకగా ఉండే బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. అద్భుత సౌందర్యంతో అలరారే మయూరం మన జాతీయ పక్షి. మర్రి మన జాతీయ వృక్షం. మామిడి జాతీయ ఫలం. పంకంలో ఉద్భవించినా నిర్మాల్యంగా ఉండే కమలం మన జాతీయ పుష్పం. ప్రజలందరూ ముక్త కంఠంతో పాడుకోవడానికి అందమైన, ఇంపైన జాతీయ గీతాలూ ఉన్నాయి. ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది. మనకంటూ ఒక జాతీయ పంచాంగమూ ఉంది. ఇవన్నీ ప్రాచీన నాగరికతలలో ఒకటిగా వర్ధిల్లిన భారత భూమి గతాన్ని స్ఫురణకు తెచ్చేవే. మన మట్టి వాసన వేసేవే. మనవైన విలువల గురించి ఎలుగెత్తి చాటేవే. మువ్వన్నెల పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. మచిలీపట్నానికి చెందిన వెంకయ్య 1916లో మొత్తం 30 రకాల ఆకృతులలో జాతీయపతాకాలను రూపొందించారు. అంతకు ముందు సిస్టర్ నివేదిత (స్వామి వివేకానంద అనుయాయి) కూడా ఒక పతాకాన్ని తయారు చేశారు. 1916లోనే అనిబిసెంట్, బాలగంగాధర్ తిలక్ హోమ్‌రూల్ ఉద్యమం తరఫున మరో పతాకాన్ని తయారు చేశారు. అయితే 1921లో గాంధీజీ నాగపూర్ కాంగ్రెస్ సమావేశాలలో వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ప్రతిపాదించారు. దానినే సంస్థ ఆమోదించింది. స్వాతంత్య్రోద్యమంలో చాలాభాగం ఈ జెండా స్ఫూర్తితోనే సాగినా, అధికారంగా జూలై 22, 1947న జాతీయ పతాకంగా ప్రకటించారు. నాలుగు సింహాలు గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడు తొలి ప్రవచనం చేసిన పుణ్యస్థలం సార్నాథ్. ఇది అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటిగా చెప్పుకునే మహా పుణ్యక్షేత్రం వారణాసి శివార్లలోనే ఉంది. అందుకే అక్కడ మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 250లో ఒక స్థూపం నిర్మించాడు. దాని కోసం చెక్కించిన నాలుగు సింహాల శిల్పాన్ని స్వతంత్ర భారతదేశం జాతీయ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన ఈ నాలుగు సింహాల శిల్పంలో ఆ భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. కింద ‘సత్యమేవ జయతే’(సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు. ఆ నాలుగు సింహాలు ఆసియాటిక్ లేదా ఇండియన్ లైన్స్. అవి కూర్చున్నట్టు చెక్కిన ఈ శిల్పాన్ని ఎదురుగా చూసినపుడు ఒకటి (వెనుక ఉన్నది) కనిపించదు. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. గుండ్రటి ఒక వేదిక మీద వీటిని చెక్కారు. ఆ గుండ్రటి వేదిక చుట్టూనే ఉంటాయి అశోక చక్రాలు. వీటినే ధర్మ చక్రాలని కూడా అంటారు. ఒక చక్రం ఒక జంతువు దాని మీద కనిపిస్తూ ఉంటాయి. బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఆ చక్రాల మధ్య చెక్కారు. నాలుగు దిక్కుల ను ఇవి చూస్తున్నట్టు ఉంటాయి. ‘సత్యమేవ జయతే’ సూక్తి ముండకోపనిషత్లోనిది. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి అన్నమాట. ఈ చిహ్నాన్ని పవిత్రంగా చూడాలని వేరే చెప్పక్కరలేదు. భారత రాష్ర్టపతి రాజముద్రిక ఇదే బొమ్మతో ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార రాజముద్ర కూడా ఈ బొమ్మతోనే ఉంటుంది. మన కరెన్సీ మీద, పాస్‌పోర్టు మీద కూడా అదే ముద్ర కనిపిస్తుంది. జాతీయ నది గంగానదిని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు. హిమాలయాల వద్ద గంగోత్రిలో భాగీరథి పేరుతో పుట్టి, గంగగా కాశీ మొదలైన ప్రదేశాలలో ప్రవహించి, పద్మ పేరుతో బంగ్లాదేశ్‌కు వెళుతుందీ మహానది. మొత్తం 2,510 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారతదేశంలో నలభై శాతం ప్రజలకు ఈ నదే జీవనాధారం. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు ఇందులో కలుస్తాయి. ఈ నదికి భారతీయ జీవనంతో అనుబంధం అనిర్వచనీయమైనది. మర్రి చెట్టు మర్రి చెట్టు మన జాతీయ వృక్షం. ఈ చెట్టుకి భారతీయ సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తుంది. ఆ చెట్టుకు పెట్టుకున్న పవిత్రమైన పేరు వటవృక్షం. వృక్షాలలో మర్రి వలెనే, దేవతలలో నేనే నరేంద్రుడను అని గీతాకారుడు చెబుతాడు. ఇది చాలు వైదిక వాఙ్మయం లో వటవృక్షానికి ఉన్న స్థానం ఎలాంటిదో చెప్పడానికి! నిజమే, ఈ భూమి మీద ఉన్న వృక్ష సంపదలో మర్రిది ప్రత్యేక స్థానం. అదో అద్భుతం. దాని విత్తనం ఎంతో చిన్నది. అదే ఇంతటి మహావృక్షాన్ని నిక్షిప్తం చేసుకున్నదన్న విషయం ఒక అద్భుతమనిపిస్తుంది. ఊడలు మళ్లీ భూమిలోకి వెళ్లి పాతుకుంటాయి. మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రి 800 సంవత్సరాలనాటిది. 330 మీటర్ల మేర విస్తరించి ఉన్న కలకత్తా మర్రి, 450 సంవత్సరాల నాటి అడయార్ మర్రి చెట్టు, 400 సంవత్సరాల నాటి రమోహళ్లి (బెంగళూరు దగ్గర) అలడ మర్రి ఎంతో ఖ్యాతి గాంచాయి. అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రి 1989లో గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేరింది. ఇవి ఎంత మేర విస్తరించి ఉంటాయో చెప్పడానికి ఒక్క చక్కని చారిత్రక సందర్భం చాలు. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు! కమలం కమలం అందాన్ని చూసి మురిసిపోని వారు ఉండరు. మన పూర్వ కవులు కూడా అంతే. స్వచ్ఛతకి తిరుగులేని ప్రతీక ఆ పుష్పం. దీనిని భారతదేశం జాతీయ పుష్పంగా ఎంచుకుంది. జలాశయాలలో లోలోతు మట్టిలో నుంచి, బురద, నాచుల మధ్య నుంచి నీటి ఉపరితలం మీదకు వచ్చి వికసిస్తుందీ పువ్వు. కానీ కాస్త కూడా బురద అంటదు. జీవితం కూడా అంత నిర్మలంగా ఉండాలని మనిషి ఆకాంక్షిస్తూ వేల సంవత్సరాలుగా ఆ పుష్పాన్ని ఆరాధిస్తున్నాడు. మనసునూ, శరీరాన్నీ భౌతిక ప్రపంచంలోని బురద అంటకుండా కాపాడుకోవాలని కలలు కంటూనే ఉన్నాడు. కమలం దైవత్వానికీ, జ్ఞానానికీ, సంపదకూ, పవిత్రతకూ ప్రతీక. భగవానుడి పాదాలను చరణకమలాలు అని కీర్తించడం పరిపాటి. మామిడిపండు మామిడిపండు మన జాతీయ ఫలం. ఈ ఫలానికి కూడా భారతీయ సంస్కృతితో ఎనలేని అనుబంధం ఉంది. మన దేశంలోనే వందకు పైగా రకాల మామిడిపళ్లు దొరుకుతాయి. భారతదేశ చరిత్రలో మహోన్నత స్త్రీగా గుర్తింపు ఉన్న ఆమ్రపాలి దొరికింది మామిడితోపులోనే. ప్రస్తుత బీహార్‌లో ఉన్న దర్బాంగాలో మొగల్ చక్రవర్తి అక్బర్ లక్ష మొక్కలతో ఒక మామిడితోటను పెంచేవాడు. ఏ,సీ,డీ విటమిన్లు పుష్కలంగా ఉండే మామిడి పండు, కాయ, ఆకు కూడా భారతీయులకు ఎంతో ముఖ్యమైనవి. విశాఖ తీరంలో పుట్టిన జాతీయ ప్రతిజ్ఞ ‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ఈ ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకటసుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకటసుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. దీనిని వెంకటసుబ్బారావుగారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందించారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిగినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. అన్ని భాషలలోకి అనువాదం చేయించి, జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు. కరెన్సీ భారత కరెన్సీ మీద దేవనాగర లిపిలో ముద్రించిన ‘రా’ అన్న అక్షరమే జాతీయ చిహ్నం. దీనిని జూలై 15, 2010న భారత ప్రభుత్వం తీసుకుంది. జాతీయ పంచాంగం చైత్ర మాసంతో మొదలయ్యే శక యుగం పంచాంగాన్ని (కేలండర్) మన ప్రభుత్వం మార్చి 22, 1957న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది. ఇందులో 365/366 రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్రెగారియన్ కేలండర్‌తో పాటు దేశీయ కేలండర్‌ను కూడా భారత్ గెజెట్, ఆకాశవాణి, ప్రభుత్వ కార్యక్రమాల వివరణకు ఉపయోగిస్తున్నారు. జాతీయ మృగం బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. రాజసం, శక్తి, సామర్థ్యం పుష్కలంగా ఉండే ఈ జంతువు భారతీయ పురాణాలలో, వాఙ్మయంలో విశేషమైన స్థానం కలిగి ఉంది. 1973 నుంచి దేశంలో పులుల సంరక్షణ పథకం ప్రారంభమైంది. ఆ సంవత్సరం ఏప్రిల్‌లోనే పులికి జాతీయ మృగం హోదా వచ్చింది. ప్రస్తుతం దేశంలో 23 టైగర్ రిజర్వులు పని చేస్తున్నాయి. నీటి జంతువు గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. జాతీయ పక్షి 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది. నెమలి అందానికే కాదు, గొప్ప మార్మికతకు కూడా పేర్గాంచినదే. 200 ఈకలతో ఉండే మగ నెమలి పింఛం రమణీయతకు ఆలవాలం. 1972లో నెమలిని వేటాడడం నిషేధించారు. వందేమాతరమ్ బంకించంద్ర చటర్జీ రాసిన నవల ‘ఆనందమఠం’లో (1882) ఒక రమ్యమైన సన్నివేశం ఉంది. మహేంద్రుడు, భవానందుడు అనే రెండు ప్రధాన పాత్రలు అర్థరాత్రి, వెన్నెల్లో అడవి గుండా వెళుతూ ఉంటారు. అంతకు ముందే దొంగలకు సంబంధించి ఆ ఇద్దరి మధ్య చిన్న వివాదం చెలరేగితే, మహేంద్రుడు అలుగుతాడు. ఆ సందర్భంలో భవానందుడు ఒక పాట అందుకుంటాడు. అదే- ‘వందేమాతరమ్.. సుజలాం సుఫలాం... మలయజ శీతలాం....’ ఆ సంస్కృత గీతానికి పరవశించిన మహేంద్రుడు వెంటనే మాట్లాడడం మొదలుపెడతాడు. ఇది బంకింబాబు సృష్టించిన మహేంద్రుడు అనే పాత్రనే కాదు, భారతదేశాన్నీ కదిలించింది. 1896లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో దీనిని మొదటిసారి పాడారు. అప్పటి నుంచి ఆ పాట పాడడం సంప్రదాయంగా మారింది. దీనిని మొదట రవీంద్రనాథ్ టాగూర్ గానం చేశాడు. అదొక ప్రత్యేకత. ఇంకొక విశేషం - అరవింద ఘోష్ దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇది పెద్ద గేయం. మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. జనగణమన సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. దీనిని మొదట కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో డిసెంబర్ 27, 1911న ఆలపించారు. తరువాత రవీంద్రుడి సంపాదకత్వంలో వెలువడిన ‘తత్వబోధ ప్రకాశిక’లో ప్రచురించారు. అది ఆరోజులలో కొద్దిమంది బ్రహ్మ సమాజ అవలంబీకులకు తప్ప ఎవరికీ తెలియదు కూడా. కానీ ఫిబ్రవరి, 1919లో టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. ఆయనను అప్పుడు థియోసఫికల్ విద్యాసంస్థల తరఫున జేమ్స్ హెచ్ కజిన్స్ ఆహ్వానించారు. అప్పుడే రవీంద్రుడు విద్యార్థుల సమావేశంలో ఆ గీతాన్ని ఆలపించారు. తరువాత జేమ్స్, ఆయన భార్య మార్గరెట్ (పాశ్చాత్య సంగీతజ్ఞురాలు) ఈ గీతాన్ని రవీంద్రుడి చేతే ఆంగ్లంలోకి అనువదింప చేసి బాణీ కట్టారు. తరువాత అది బడిపిల్లలకు ఉదయగీతంగా మారిపోయింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. జిలేబీ అనధికారికంగా దేశంలో చాలా చోట్ల జిలేబీని జాతీయ మిఠాయిగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే మొదటి తరం వంటకాల పుస్తకాలలో ఒకటిగా పేరొందిన మహ్మద్ బిన్ హసన్ అల్ బాగ్దాదీ పుస్తకంలో జిలేబీ ప్రస్తావన కనిపిస్తుంది. ఇది 13 శతాబ్దంలో వచ్చిన వంటకాల పుస్తకం. ఇది ముస్లింల పాలనలోనే భారతదేశంలోకి ప్రవేశించిన మాట నిజం. జైన మత బోధకుడు జినసుర క్రీ.శ.1450 రాసిన ‘ప్రియకర్ణపాకత’ పుస్తకంలో కూడా జిలేబీ ప్రస్తావన ఉంది. ఏ విధంగా చూసినా భారతదేశంలో ఈ మిఠాయి 500 సంవత్సరాలకు పూర్వమే తయారైనట్టు దాఖలాలు కనిపిస్తాయి. హాకీ మొత్తం 15 జాతీయ చిహ్నాలు మన జాబితాలో కనిపిస్తాయి. అందులో హాకీని జాతీయ క్రీడగా పరిగణించడం ఒకటి. హాకీలో ఇంతవరకు ఒలింపిక్స్ పోటీలలో 8 బంగారు,1 వెండి, 2 రజత పతకాలను భారత దేశం తెచ్చుకుంది. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరు పర్యాయాలు ఒలింపిక్స్‌లో మనదేశమే చాంపియన్‌గా నిలిచింది. ఇంతకీ హాకీ జాతీయ క్రీడేనా? కాదు. తన పాఠ్య పుస్తకాలలో మన జాతీయ క్రీడ హాకీ అని చెప్పడం కనిపించిందనీ, ఇది వాస్తవమో కాదో వివరించవలసిందంటూ 2012లో ఐశ్వర్య పరాశర్ అనే పదేళ్ల బాలిక సమాచార హక్కు చట్టం కింద చేసిన విన్నపం మేరకు ఆగస్టు 2, 2012న ఆనాటి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ శివప్రతాప్‌సింగ్ తోమార్ హాకీ కి జాతీయ క్రీడ హోదా లేదని తెలియ చేశారు. అంటే మన దేశానికి జాతీయ క్రీడ లేదు. జాతీయ చిహ్నాలను తయారు చేసుకున్నాం సరే, వాటిని గౌరవించే దృక్పథం మనలో ఉన్నదా? అది ప్రశ్నార్థకమే. నెమలి, పులి మీద జరుగుతున్న దాడులు, గంగ కాలుష్యం మన నిజాయితీని నిలదీస్తున్న సంగతి వాస్తవం. జాతీయ చిహ్నాలను అగౌరవ పరచడం రాజ్యాంగ విరుద్ధం. కానీ చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. - డా॥గోపరాజు నారాయణరావు -
మన జెండా మననేత...
రేపు పింగళి వెంకయ్య జయంతి పింగళి వెంకయ్య 136వ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన స్వగ్రామం భట్లపెనుమర్రులో ఏర్పాట్లు చేస్తున్నారు. స్మారక భవన నిర్మాణ కమిటీ, పాలకమండలి, గ్రామస్తులతోపాటు గ్రామ సర్పంచి ఈ ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, జిల్లా సీఈవో దాసరి సుదర్శనం అతిథులుగా వస్తారని సర్పంచి కొడాలి దయూకర్ విలేకరులకు తెలిపారు. భరతజాతి ఔన్నత్యానికి, కీర్తి ప్రతిష్టలకు ప్రతీక మువ్వన్నెల జెండా. భారతమాతకు కృష్ణాజిల్లా నుంచి పంపిన పుట్టింటి పట్టుచీర. ప్రపంచమంతా చెయ్యెత్తి జై కొట్టే ఈ త్రివర్ణ పతాకాన్ని చూడచక్కగా తీర్చిదిద్ది కృష్ణాజిల్లా ఖ్యాతిని నలుదిశలా ఎగురవేసిన మహనీయుడు పింగళి వెంకయ్య. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1878, ఆగస్టు రెండో తేదీన జన్మించారు. ఇక్కడి ఎలిమెంటరీ పాఠశాలలో చదివిన ఆయన 1916 నుంచి 1922 వరకు పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఉద్యమాల్లో లాఠీదెబ్బలు తిని, జైళ్లలో మగ్గారు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో విజయవాడలోని గాంధీనగర్‌లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. ఆ సమావేశంలో పాల్గొన్న మహాత్మాగాంధీ పింగళిని పిలిచి జాతీయ జెండా రూపొందించాలని కోరారు. ఆ వెనువెంటనే మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాల అధ్యాపకుడు ఈరంకి వెంకటశాస్త్రి తోడ్పాటుతో పింగళి కేవలం మూడు గంటల వ్యవధిలో త్రివర్ణ పతాకాన్ని తయారుచేశారు. పతాకం మధ్యలో రాట్నం ఉంటే బాగుంటుందని గాంధీజీకి చెప్పి ఒప్పించిన ఘనత ఆయనదే. దీనిపై 1921 ఏప్రిల్ 13న ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఆయనకు ప్రశంసలు కూడా లభించారుు. 1931లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఏర్పాటుచేసిన ఉపసంఘం కూడా వెంకయ్య రూపొందించిన జెండానే ఖరారు చేయడం విశేషం. 1947 జులై 22న జెండాకు మధ్యలో రాట్నానికి బదులు అశోకచక్రం చేర్చి జాతీయ పతాకంగా భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. జాతీయ పతాకం నిర్మించిన తర్వాత పింగళి వెంకయ్య 1922లో రాజకీయాల నుంచి వైదొలిగారు. స్వాతంత్య్రానంతరం ఆయనను ప్రభుత్వం ఖనిజ సలహాదారుడిగా నియమించింది. 1950లో దానిని రద్దుచేశారు. జీవిత చివరి దశలో దుర్భర జీవితాన్ని అనుభవించిన పింగళి 1963 జులై 4న కన్నుమూశారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన పింగళి స్మారకార్థం భట్లపెనుమర్రులో ఆయన పేరున ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. కూచిపూడి నుంచి పెడసనగల్లు మీదుగా భట్లపెనుమర్రు వెళ్లే రహదారికి పింగళి నామకరణం చేశారు. - కూచిపూడి