గుర్రంకొండ పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ నేతల దౌర్జన్యం
ఎస్‌ఐపైనే చేయి చేసుకున్నటీడీపీ నేతలు
అడ్డుకున్న కానిస్టేబుళ్లపైనా దాడి
లాఠీఛార్జి చేసిన పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గత 20 రోజులుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చివరకు పోలీసులపైనే దాడికి బరితెగించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పోలీసు స్టేషన్ వద్దే ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకొని, బూతులు తిడుతూ దౌర్జన్యానికి తెగబడ్డారు. చివరకు పోలీసులు లాఠీచార్జీ చేసి టీడీపీ నాయకులను అక్కడి నుంచి తరిమారు. వివరాలు ఇలా ఉన్నాయి . గుర్రంకొండ మండలంలోని అమిలేపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రమణ కోర్టులో స్టే తెచ్చుకొని తన స్థలంలో ఇనుప కంచె వేసుకున్నాడు.
ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సోమవారం ఈ స్థలంలో ఉన్న ఇనుప కంచెను దౌర్జన్యంగా తొలగించారు. ఇదేమిటని ప్రశి్నంచిన వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకుడిని పోలీస్ స్టేషన్‌కు విచారణకు పిలిపించారు. అతని వెంట ఎంపీపీ యోగేంద్ర, జెడ్పీటీసీ సమ్రీన్ ముక్తియార్, మాజీ సర్పంచ్ జగన్‌మోహన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ముందు కుర్చిలలో వారంతా కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నా కొ..లని స్టేషన్ వద్ద కుర్చిల్లో ఎలా కూర్చోబెడతారంటూ కేకలు వేస్తూ లోపలికి చొచ్చుకొని వచ్చారు.
స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐ శ్రీనివాసనాయక్, ఏఎస్‌ఐ నరసింహులు, సిబ్బంది వారిని అడ్డుకొని ఏమైనా ఉంటే స్టేషన్లో కూర్చోని మాట్లాడుకొందామని కోరారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ నాయకులు ఎస్‌ఐ శ్రీనివాస్ నాయక్‌పై చేయి చేసుకొని, కింద పడేశారు. అడ్డుకోబోయిన కానిస్టేబుళ్లను కూడా కిందికి తోసేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో టీడీపీ వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. వాల్మికిపురం సీఐ శేఖర్ స్టేషన్ వద్దకు చేరుకొని విచారణ జరిపారు. పోలీసులపై దాడి చేసిన టీడీపీ నాయకుల కొసం గాలిస్తూ వెళ్లిపోయారు. ఎస్‌ఐపై దాడి చేయడం గుర్రంకొండ చరిత్రలో ఇదే మొదటిసారని గ్రామస్తులు చర్చించుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment