తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురికి అందజేసిన రాష్ట్రపతి ముర్ము
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం: సంగీత, నృత్య, నాటక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువురికి సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. బుధవారం విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకు గానూ విజేతలకు రాష్ట్రపతి పురస్కారాలు బహూకరించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారులు రాజా–రాధారెడ్డి 2022–23 గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నారు. వీరితోపాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరుకు చెందిన వినుకొండ సుబ్రహ్మణ్యం 2022 సంవత్సరానికి కర్ణాటక ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్ (తవిల్) విభాగంలో అవార్డు అందుకున్నారు.
కర్నూలుకు చెందిన మద్దాలి ఉషాగాయత్రి కూచిపూడి రంగంలో 2023 సంవత్సరానికి, అవనిగడ్డకు చెందిన ఎల్‌వీ గంగాధరశాస్త్రి సుగం సంగీత్‌లో 2023 సంవత్సరానికి, కర్ణాటక గాత్ర సంగీతంలో పేరుగాంచిన విశాఖకి చెందిన మండ (ఆలమూరు) సుధారాణి 2022 సంవత్సరానికి పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన పేరిణి ప్రకాష్ పేరిణియాట్టంలో 2023 సంవత్సరానికి, హైదరాబాద్‌కు చెందిన భాగవతుల సేతురామ్ కూచిపూడి నృత్యంలో 2022 సంవత్సరానికి అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment