పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | Preserving The Environment is Everyone's Responsibility Says DD Chinna Peddaiah | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Published Fri, Jun 10 2022 11:18 PM | Last Updated on Sat, Jun 11 2022 3:02 PM

Preserving The Environment is Everyone's Responsibility Says DD Chinna Peddaiah - Sakshi

రోడ్డకు ఇరువైపులా నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలను పరిశీలిస్తున్న డీడీ 

రాయచోటి టౌన్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని డ్వామా డీడీ చిన్నపెద్దయ్య సూచించారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి డ్వామా కేంద్రంలో జిల్లాలోని మండలాల జాతీయ ఉపాధి హామీ  ఏపీడీలు, ఏపీవోలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత మూడు సంవత్సరాలుగా జరిగిన ఉపాధి పనులపై సమీక్షించుకోవాలని చెప్పారు.

వీటిలో ఏ సంవత్సరంలో ఎక్కువ పనిదినాలు జరిగాయనే అంశాలను తీసుకొని జరిగిన ఎక్కువ రోజులకు మరో 20శాతం కలుపుకొని దానినే టార్గెట్‌గా చేసుకోవాలన్నారు. రాబోవు రోజులలో దీనినే  టార్గెట్‌ చేసుకొని ఆ పద్ధతి ప్రకారం పనిదినాలు పెంచాలని చెప్పారు. అలాగే పర్యావరణాన్ని కాపాడే విధంగా అన్ని ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులందరూ కలసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జీఎస్‌ కౌన్సిల్‌ సభ్యుడు విశ్వనాథం, పీడీ శివప్రసాద్, ఏపీడీలు, ఏసీలు, ,అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement