నేడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
23న అల్పపీడనంగా మారే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వారం రోజులుగా వేసవిని తలపిస్తున్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సగటున సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
శనివారం అండమాన్ సముద్ర పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ నెల 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈశాన్య రుతుపవన కాలం ప్రారంభమయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.’ అని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment