
సాక్షి, అమరావతి: ఫేస్‌బుక్‌లో పోస్టు ద్వారా అభ్యర్థించిన వెంటనే ప్రయాణికులకు ఓ బస్సు సర్వీసును ఏర్పాటు చేసి ప్రజా సేవే తమ లక్ష్యమని ఆర్టీసీ నిరూపించిన ఆసక్తికరమైన ఘటన కృష్ణాజిల్లాలోని పామర్రులో జరిగింది. 40 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లాల్సి ఉంది.
వీరిలో ఒకరు తమకు బస్సు ఏర్పాటు చేయగలరా అని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డిని ఫేస్‌బుక్ పోస్టు ద్వారా అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన బ్రహ్మానందరెడ్డి గుడివాడ బస్ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆ ప్రయాణికులకు పామర్రు నుంచి నెల్లిమర్లకు ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు.
ఆ 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానమైన నెల్లిమర్లకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అడగంగానే సాయం చేసిన ఆర్టీసీ సేవలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment