విజయవాడ: ఈ సంక్రాంతి ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 141 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను ప్రయాణిలు విశేషంగా ఆదరించడంతో భారీగా ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు.
తిరుగు ప్రయాణానికి కూడా తగినన్ని బస్సులు వేయడంతో విశేష ఆదరణ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 1,483 ప్రత్యేక బస్సులు నడిపడమే కాకుండా, జనవరి 6వ తేదీ నుండి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.
కాగా, సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీఎస్ ఆర్టీసి బస్సులకే అధిక ప్రాధానిమచ్చారు. రాను-పోను టికెట్లపై బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం కూడా ఏపీఎస్ ఆర్టీసీ భారీ ఆదాయానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment