కోడిపందేలు నిషేధం: డీఎస్పీ | Sankranti Festival Cockfight Sport Is Banned In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Sankranti 2022: కోడిపందేలు నిషేధం: డీఎస్పీ

Published Sun, Jan 9 2022 8:21 AM | Last Updated on Sun, Jan 9 2022 8:30 AM

Sankranti Festival Cockfight Sport Is Banned In Andhra Pradesh - Sakshi

అవగాహన కల్పస్తున్న డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి

క్రోసూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందేలు నిర్వహించడం, కోడి కత్తులు విక్రయించడం, పేకాట తదితర జూదాలపై నిషేధం ఉన్నట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి తెలిపారు. శనివారం క్రోసూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. కోడి పందేలు నిర్వహించేవారిపై అవసరమైతే సస్పెక్ట్‌ షీట్‌ తెరుస్తామని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్‌ సీఐ ఆర్‌.ఉమేష్, ఎస్‌ఐ ఎం.నారాయణ పాల్గొన్నారు.

అచ్చంపేట: అచ్చంపేటలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని శనివారం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి సందర్శించారు. కోడిపందేల నిషేధంలో భాగంగా 12 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట సత్తెనపల్లి సీఐ ఆర్‌.ఉమేష్, అచ్చంపేట ఎస్‌ఐ సీహెచ్‌ మణికృష్ణ పాల్గొన్నారు.

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
ముప్పాళ్ళ: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందేలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ఎం.పట్టాభిరామయ్య చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కోడిపందేల నిర్వాహకులను శనివారం బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ  మాట్లాడుతూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇంట్లోనే పండుగను జరుపుకోవడం మంచిదన్నారు. ఆరుగురిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.

జూదాలు నిర్వహిస్తే శిక్ష తప్పదు
సత్తెనపల్లి: కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ ఆవుల బాలకృష్ణ హెచ్చరించారు. శనివారం ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో మండలంలో కోడిపందేలు నిర్వహించిన వ్యక్తులకు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

చదవండి: గాల్లోకి ఎగిరి.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వివాహిత మృతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement