sattenpalli
-
కోడిపందేలు నిషేధం: డీఎస్పీ
క్రోసూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందేలు నిర్వహించడం, కోడి కత్తులు విక్రయించడం, పేకాట తదితర జూదాలపై నిషేధం ఉన్నట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి తెలిపారు. శనివారం క్రోసూరు రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. కోడి పందేలు నిర్వహించేవారిపై అవసరమైతే సస్పెక్ట్ షీట్ తెరుస్తామని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సీఐ ఆర్.ఉమేష్, ఎస్ఐ ఎం.నారాయణ పాల్గొన్నారు. అచ్చంపేట: అచ్చంపేటలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని శనివారం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి సందర్శించారు. కోడిపందేల నిషేధంలో భాగంగా 12 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట సత్తెనపల్లి సీఐ ఆర్.ఉమేష్, అచ్చంపేట ఎస్ఐ సీహెచ్ మణికృష్ణ పాల్గొన్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు ముప్పాళ్ళ: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందేలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య చెప్పారు. స్థానిక పోలీస్స్టేషన్లో కోడిపందేల నిర్వాహకులను శనివారం బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇంట్లోనే పండుగను జరుపుకోవడం మంచిదన్నారు. ఆరుగురిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. జూదాలు నిర్వహిస్తే శిక్ష తప్పదు సత్తెనపల్లి: కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఆవుల బాలకృష్ణ హెచ్చరించారు. శనివారం ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో మండలంలో కోడిపందేలు నిర్వహించిన వ్యక్తులకు రూరల్ పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: గాల్లోకి ఎగిరి.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వివాహిత మృతి! -
మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే..
సత్తెనపల్లి: గుడిపూడి ఎస్సీ కాలనీలో విషాదం అలుముకుంది. గుడిపూడి గ్రామానికి చెందిన చింతలపూడి చిన్నచార్లెస్ (45) హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని గుడిపూడి ఎస్సీ కాలనీకి తీసుకొచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న చార్లెస్ మృతి వార్త తెలియడంతో మృతుని సోదరుని అత్త ప్రకాశం జిల్లా తంగేడుమల్లికి చెందిన సరిమళ్ల నాగరత్నమ్మ (67) గుడిపూడి గ్రామానికి వచ్చింది. మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక గుండెపోటుతో ఆమె మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఎస్సీ కాలనీకి చెందిన మోదుగుల జోజిబాబు (35) అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆ కాలనీలో ముగ్గురు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. చదవండి: Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..! -
వ్యభిచారం చేస్తూ దొరికిన టీడీపీ నేత
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలకేంద్రంలో ఓ టీడీపీ నాయకుడు వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో సదరు నేత వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పట్టుబడిన టీడీపీ నేత ముప్పాళ్ల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుబాబుగా గుర్తించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు యువతులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరినీ స్టేషన్కు తరలించారు. -
లారీ ఢీకొని ఒకరి మృతి
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెక్పోస్ట్ సమీపంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.