
సత్తెనపల్లి: గుడిపూడి ఎస్సీ కాలనీలో విషాదం అలుముకుంది. గుడిపూడి గ్రామానికి చెందిన చింతలపూడి చిన్నచార్లెస్ (45) హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని గుడిపూడి ఎస్సీ కాలనీకి తీసుకొచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
చిన్న చార్లెస్ మృతి వార్త తెలియడంతో మృతుని సోదరుని అత్త ప్రకాశం జిల్లా తంగేడుమల్లికి చెందిన సరిమళ్ల నాగరత్నమ్మ (67) గుడిపూడి గ్రామానికి వచ్చింది. మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక గుండెపోటుతో ఆమె మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఎస్సీ కాలనీకి చెందిన మోదుగుల జోజిబాబు (35) అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆ కాలనీలో ముగ్గురు మృతి చెందడంతో విషాదం అలుముకుంది.
చదవండి: Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..!
Comments
Please login to add a commentAdd a comment