
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెల రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్ షా ఆదేశించారు. ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిషికేషన్ ద్వారా ప్రకటించాలన్న సీఎం జగన్ విజ్ఞప్తికి అమిత్ షా అంగీకరించారు.
(చదవండి: ‘విభజనతో భారీగా నష్టపోయాం.. ఏడేళ్లు గడిచినా హమీలు అమలు కాలేదు’)
అలానే ఏపీ ప్రస్తావించిన గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై అమిత్ షా స్పందిస్తూ.. భూమిని ఇస్తే.. ఖర్చు తామే భరించి సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment