
తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స
అగనంపూడి: గ్రామ సింహాలు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన విశాఖలో జరిగింది. జీవీఎంసీ 85వ వార్డు ఫార్మాసిటీ నిర్వాసిత కాలనీ పానకాలయ్యపేట బోనంగికి చెందిన సిద్ధనాతి నూక అప్పారావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి అప్పారావు భార్య లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటుండగా, అప్పారావు పనిమీద బయటకు వెళ్లాడు.
రోడ్డు మీద ఆడుకుంటున్న వీరి కుమార్తె యక్షిత (3)పై రెండు వీధి కుక్కలు దాడి చేయగా శరీరం వెనుక భాగం, మెడ, తలపై కూడా తీవ్రంగా గాట్లు పడ్డాయి. స్థానికులు కుక్కలను తరిమికొట్టి పాపను రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. ప్రాణాపాయ స్థితి తప్పినట్లు వైద్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment