రాష్ట్రం భానుడి భగభగలో మండుతోంది! సాదారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ | Sakshi
Sakshi News home page

భానుడి భగభగలో మండుతున్న ఏపీ! సాదారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ.. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు

Published Tue, Apr 11 2023 5:49 AM

Temperatures rise across the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటె ఎక్కువగా నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీని విశ్లేషించినప్పుడు చాలా ప్రాంతాల్లో అసౌకర్య సూచికలు (డిస్‌­కంఫర్టబుల్‌ ఇండెక్స్‌) పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ఎండ ప్రభావంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.

ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందంటు­న్నారు. వారం రోజుల పాటు  ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. మంగళవారం 26 మండలాల్లో  వడగాడ్పులు వీచే అవ­కాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  అడ్డ­తీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజ­వొ­మ్మంగి, వరరామచంద్రపురం,  కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement