తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. పదిరోజుల పాటు దాదాపు 6.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకుని.. ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే.
ఇవ్వాల్టి నుండి యదావిధిగా కొనసాగుతున్న దర్శనాలు
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (ఆదివారం) 70,826 మంది స్వామివారిని దర్శించుకోగా 22,625 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.68 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 1 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment