తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 67,616 మంది స్వామివారిని దర్శించుకోగా 22,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 1 గంటల్లో దర్శనం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment