సాక్షి, తిరుపతి: తిరుమలలో వన్యప్రాణుల సంచారం.. భక్తుల భద్రతపై ఆందోళన నెలకొన్న దరిమిలా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు తెలియజేశారు.
కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన లక్షిత చిన్నారిని చిరుత చంపేసింది. నడకదారిలో వెళ్లే భక్తులకు అపాయం లేకుండా చూడటానికి అటవీశాఖ, పోలీసులతో ఈ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాము. సమావేశంలో అటవీశాఖ టీటీడీకి అనే సూచనలు చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నాం.
► భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందుకోసం ఎంత ఖర్చైనా చేస్తాం.
► కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక ఊతకర్రను ఇవ్వనున్నాం. కర్రే ఇక భక్తులకు ప్రధాన ఆయుధం.
► అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో ఉదయం 5 గం. నుంచి మధ్యాహ్నం 2గం. వరకే పిల్లలకు అనుమతి. కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి. ఘాట్‌రోడ్‌లో వెళ్లే టూవీలర్స్‌కు సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి. అలాగే భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించాం.
► నడకదారిలో సాధుజంతువులకు కూడా ఎలాంటి ఆహారం ఇవ్వొద్దు. ఇస్తే చర్యలు తీసుకుంటాం.
► ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో పిల్లను అనుమతించం.
► భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించాం. తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాల ఏర్పాటు. అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలు కూడా వాడతాం.
► భక్తులపై చిరుత దాడుల గురించి చర్చించాం. భక్తుల భద్రతలకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియమిస్తాం.
► నడకదారిలో ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. బేస్ క్యాంప్‌తో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం.
► నడకదారి లో ప్రమాదాలపై భక్తులకు అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డ్స్ ఏర్పాటు. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తాం. భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తాం.
► ఫెన్సింగ్ ప్రతిపాదన పెట్టాం. అధ్యయనం చేయాలని అటవీశాఖ అంటోంది. ఆ తర్వాతే ఫెన్సింగ్ గురించి నిర్ణయం తీసుకుంటాం.
► తిరుమలలో దుకాణాలు వ్యర్థాలు పడేయరాదు. బయటే వదిలేసే షాపులపై చర్యలు తీసుకుంటాం.
► కాలినడకన వెళ్లే వారికి గతంలో నేను చైర్మన్ గా ఉన్న సందర్భంగా దర్శన టికెట్లు కేటాయించాం. 15 వేల మందికి ప్రస్తుతం నడకదారి భక్తులకు టోకెన్లు ఇస్తున్నాము, వాటిని గాలిగోపురం వద్ద చెక్ చేసుకోవాలి. ఇకపై భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దర్శన టికెట్లు గాలిగోపురం వద్ద చెకింగ్ అవసరం లేదు.
► అటవీశాఖ నిబంధనలు ప్రకారమే నిర్ణయాలు తీసుకొన్నాము. గతంలో టీటీడీ సంరక్షణలో పునుగు పిల్లిని అటవీశాఖ అధికారుల అదేశంతో జూ పార్క్ తరలించాము.
తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్‌లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన క్రూరమృగాల సంచారం.. నడకదారిలో భక్తుల భద్రతపై చర్చ ప్రధానాశంగా జరిగిన ఈ భేటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అటవీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లక్షితను చంపింది చిరుతేనా?
Comments
Please login to add a commentAdd a comment