
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి ప్రారంభం కానున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు.
ఈ మేరకు ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరధం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామన్నారు.
చదవండి: జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
బ్రహ్మోత్సవాల సమయంలో అధిక రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏడు రోజులు ఏటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా, సాంప్రదాయంగా టీటీడీ సిబ్బందితో పాటుగా, అన్ని విభాగాల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు.
తిరుమలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నమని భూమన కరుణాకర్ పేర్కొన్నారు. భక్తులకు భద్రత విషయంతో ఎటువంటి లోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment