TTD: TTD Invites CM YS Jagan To Vontimitta kodanda Ramaswamy Kalyanam - Sakshi
Sakshi News home page

TTD-CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

Published Fri, Apr 8 2022 5:53 PM | Last Updated on Sat, Apr 9 2022 10:35 AM

TTD Invites CM YS Jagan Vontimitta kodandaRamaswamy Kalyanam - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలకు విచ్చేయాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలను టీటీడీ అధికారులు ఆహ్వానించారు.  ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌.. సీఎం జగన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు. కాగా 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. టీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement