సాక్షి,అమరావతి : టీటీడీ పాలకమండలి జీవోపై ప్రతిష్టంభన నెలకొంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎంపిక వార్తల నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. మిడ్ నైట్ మసాలా షో నడిపిన వాళ్లకి టీటీడీ బాధ్యతలా అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
టీటీడీ సభ్యులుగా ఎన్నికైన ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శల నేపథ్యంలో జీవో జారీపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం.
టీడీడీ బోర్డు సభ్యులుగా
టీవీ–5 అధినేత బీఆర్ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ నేతలు పనబాక లక్షి్మ, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment