tirumla tirupathi devastanam
-
టీటీడీ పాలకమండలి నియామకంలో ట్విస్ట్
సాక్షి,అమరావతి : టీటీడీ పాలకమండలి జీవోపై ప్రతిష్టంభన నెలకొంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎంపిక వార్తల నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. మిడ్ నైట్ మసాలా షో నడిపిన వాళ్లకి టీటీడీ బాధ్యతలా అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టీటీడీ సభ్యులుగా ఎన్నికైన ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శల నేపథ్యంలో జీవో జారీపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం.టీడీడీ బోర్డు సభ్యులుగా టీవీ–5 అధినేత బీఆర్ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ నేతలు పనబాక లక్షి్మ, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ నియమితులయ్యారు. -
TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. బస్ టికెట్ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు తిరుమలకు వెళ్లే భక్తులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు. కాగా, తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ.. శ్రీవారి దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పించింది. టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఈ దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం కలదు. అయితే, బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకోవాలి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది. ఇక, టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు వివరించారు. www.tsrtconline.in ఆన్లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చు. కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు -
శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
-
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం
-
వెంకన్న భక్తులకు లడ్డూల కోత
తిరుమల: శ్రీకల్యాణ వెంకన్న లడ్డూలకు తిరుమల తిరుమతి దేవస్థానం(టీటీడీ) కోత విధించనుంది. ఇప్పటి వరకూ భక్తులకు ఇస్తున్న నాలుగు లడ్డూలను రెండుకు తగ్గించనుంది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు రెండు లడ్డూలు ఇవ్వాలన్న ప్రతిపాదనను నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక మొత్తంలో ఆదాయం వచ్చిపడుతున్నా, లడ్డూలపై కోత విధించడంపై విమర్శలకు తావిస్తోంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూల కోసం తిరుమల వెళ్లి వచ్చిన ప్రతివారినీ ఇతరులు అడుగుతుంటారు. అలా పదిమందికీ ప్రసాదం పంచిపెట్టినా కూడా పుణ్యమేనని తిరుమల వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరూ వీలైనన్ని లడ్డూలు తీసుకొచ్చి, అందరికీ పంచుతుంటారు. అలాంటిది ఇప్పుడు కోత పెట్టడంపై పలు విమర్శలు వస్తున్నాయి. బ్లాకులో కావాలంటే మాత్రం ఎన్ని లడ్డూలైనా దొరుకుతున్నాయని, నిజమైన భక్తులకే అందట్లేదని మండిపడుతున్నారు.