
మృతిచెందిన సాయి, మౌనిక
వెంకటాపురం(మోపిదేవి): తెలిసీ తెలియని వయసులో వావివరుస మరిచి ఆకర్షణకు లోనై.. అదే ప్రేమ అనుకుని ఉన్మాదులుగా మారిన ఆ చిన్నారులు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. ఈ హృదయ విదారక ఘటన మోపిదేవి మండలం వెంకటాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన రాంబాబు కుమారుడు సాయి(22), పేరుబోయిన వెంకట స్వామి కుమార్తె మౌనిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకే ఇంటి పేరు, అన్న–చెల్లెలు వరుస కావడంతో విషయాన్ని గోప్యంగా ఉంచారు. చివరకు విషయం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల వారూ ఇద్దరినీ మందలించారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సాయి, మౌనిక ఇంటి నుంచి బయటకు పారిపోయారు. ఆదివారం విషయం గుర్తించిన ఇరు కుటుంబాల వారు గాలింపు చర్యలు చేపట్టగా పెదకళ్లేపల్లి శివారు చల్లపల్లి రోడ్డు పొలంలో వేపచెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. సాయి వెంకటాపురం గ్రామ వలంటీర్‌గా పనిచేస్తుండగా, మౌనిక పది పరీక్షలకు సిద్ధమవుతోంది. ఎస్సై నాగరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చదవండి: ఉసురు తీసిన ప్రేమ
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment