ఎన్‌సీసీ విద్యార్థులకు వేరుగా పరీక్షలు  | UGC reference for colleges and universities about NCC Students | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ విద్యార్థులకు వేరుగా పరీక్షలు 

Published Thu, Dec 2 2021 5:26 AM | Last Updated on Thu, Dec 2 2021 1:49 PM

UGC reference for colleges and universities about NCC Students - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్‌సీసీ క్యాడెట్లకు సెమిస్టర్‌ పరీక్షలను ప్రత్యేక తేదీల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు సూచనలు జారీ చేసింది. ఈ ప్రత్యేక పరీక్షలకు వచ్చే వారిని మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులుగా పరిగణించరాదని తెలిపింది.  

‘ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో రిపబ్లిక్‌ డే క్యాంప్‌ కోసం ప్రిపరేషన్‌/ట్రైనింగ్‌ క్యాంపుల్లో క్యాడెట్లు పాల్గొంటున్నారని.. ఫలితంగా వారు సెమిస్టర్‌ తరగతులకు హాజరు కావడంలో, పరీక్షలు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్‌సీసీ విభాగం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో సంస్థ ఈ సూచనలు జారీచేసింది. వారికి ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక తేదీల్లో పరీక్షలకు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని యూజీసీ బుధవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement