
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.
మంగళవారం పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలోని అంబలపల్లెలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
∙ప్రొద్దుటూరు పట్ణణంలోని 9వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వారికి కలిగిన లబ్దిని వివరించి చెప్పారు.
∙జమ్మలమడుగు పట్టణంలోని 10, 11 వార్డుల పరిధిలోని నేతాజీ నగర్‌లో ఎమ్మెల్యే డా. సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగునా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment