సాక్షి, అమరావతి: అగ్రరాజ్యం అమెరికా ఆంధ్రప్రదేశ్‌కి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించింది. అమెరికా -భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వీటిని అందజేశారు. ఏపీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసినందుకు గాను ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ వీటికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లాకు 200, పశ్చిమ గోదావరికి 100, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు 50 చొప్పున తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment