
కడప కల్చరల్ : జాతీయ స్థాయిలో అలోఫ్ బుక్ కంపెనీ ప్రచురించిన ఉత్తమ కథల సంకలనంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన యువ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ కథకు చోటు లభించింది. ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థగా దక్షిణాసియా దేశాల్లో ఎంతో ఆదరణగల అలోఫ్ బుక్ కంపెనీ ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన భారతీయ ఉత్తమ వర్తమాన కథల ఆంగ్ల సంకలనంలో తెలుగు నుంచి వేంపల్లె షరీఫ్ రాసిన ‘ఒంటి చేయి’ కథకు చోటు దక్కింది.
దేశంలోని వివిధ భాషల్లో 40 మంది ఉత్తమ వర్థమాన కథలతో ఆ కంపెనీ ‘ఏ కేస్ ఆఫ్ ఇండియన్ మార్వెల్స్’ పేరిట పుస్తకాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పెంగ్విన్ ప్రచురణ సంస్థ సీఈఓ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇక షరీఫ్ కథను బెంగళూరుకు చెందిన ప్రముఖ అనువాదకులు ఎన్‌ఎస్ మూర్తి ‘క్రిపుల్డ్ వరల్డ్’ పేరుతో అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమి ద్వైమాస పత్రిక ది ఇండియన్ లిటరేచర్‌లో కూడా ఈ కథ ఆంగ్ల అనువాదం ప్రచురితమైంది. (క్లిక్: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్.. చివరికి ఏమైంది?)
Comments
Please login to add a commentAdd a comment