సాక్షి, అమరావతి : రామతీర్థం వద్ద శనివారం కొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లు, వాటర్ ప్యాకెట్లతో తనపై దాడి చేశారని, చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్‌లోనే ఈ దాడి జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్‌మెన్‌కు గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో నెల్లిమర్ల పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ( రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే? )
అంతకు క్రితం ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ అను’కుల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తాడు. పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలు ససేమీరా విప్పేది లేదంటాడు. భక్తి గురించి, మత విశ్వాసాల గురించి ఈయన ప్రవచనాలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది!’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment