Ramathirtham temple
-
రామతీర్థంలో నేడు సీతారాముల కళ్యాణం
-
మత విద్వేషాలకు భారీ కుట్ర
సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఇటీవల భారీ కుట్ర జరుగుతోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి విధ్వంసకర శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుశ్చర్యలు.. దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తూ దేవతామూర్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. పథకం ప్రకారం విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు సమాజాన్ని విడదీసి ప్రజల దృష్టి మరల్చానే కుట్ర జరుగుతోందన్నారు. దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను, శక్తులను సమాజం అంతా కలిసి అడ్డుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ చేసినట్లు వివరించారు. కమిటీల్లో అన్ని మతాలకు స్థానం.. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటైన కమిటీలు తరచూ సమావేశమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయడంతోపాటు శాంతియుత వాతావరణం వెల్లివిరిసేలా దోహదం చేస్తాయని సీఎస్ వివరించారు. అన్ని వర్గాల్లో విశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందిస్తూ మత సామరస్యాన్ని పరిరక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మత సామరస్య కమిటీలు దోహదం చేస్తామని సీఎస్ తెలిపారు. కమిటీల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కమిటీలు సందర్శిస్తాయని చెప్పారు. కొన్ని ఘటనలకు సంబంధించి వెంటనే కేసులు నమోదు చేశామని, నిందితులను గుర్తించడంతో పాటు వీటి వెనక ఎవరున్నారో కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు కులమతాలను ఆపాదించడం హేయమైన చర్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎస్, కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీకి డీజీపీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, జైన్‌లతో పాటు ఇతర మతాలకు చెందిన ఒక మత పెద్ద ప్రతినిధిగా ఉంటారు. హోం, దేవదాయ, మైనార్టీ వెల్ఫేర్, సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, ఇతర భాగస్వామ్యులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వైస్ చైర్మన్‌గా జిల్లా ఎస్పీ ఉంటారు. జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) కన్వీనర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ విధివిధానాలు.. ►మతవిద్వేషాలను రగిల్చేలా సందేశాలను ప్రచారం చేయడం, మతసామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై చర్చించాలి. ►స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్, ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలి. మత సామరస్యం పెంపొందించేలా కార్యక్రమాలతో పాటు కార్యాచరణ సిద్ధం చేయాలి. ►జిల్లా స్థాయి మతసామరస్య కమిటీలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ కింద నమోదైన క్రిమినల్ చర్యలన్నింటినీ పరిశీలించాలి. ►మతసామరస్యం వెల్లివిరిసేలా పాఠశాల, కళాశాల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా స్థాయి కమిటీ విధివిధానాలు ►జిల్లా స్థాయిలో ఏదైన సంఘటన వల్ల మతసామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సంకేతాన్ని పంపాలి. క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక, మతపరమైన సమతుల్యతను కాపాడే విధంగా జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కృషి చేయాలి. ►గతంలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ►సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమీక్షించాలి ►భూములు, లేదా ఇతర సంఘటనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉన్నచోట్ల పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి. ►ప్రార్థనా మందిరాలు, ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి. ► ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పురోగతిపై సమీక్షించాలి. కరెంట్ రంపం వాడిన దుండగులు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసానికి వినియోగించిన ఎలక్ట్రికల్ రంపాన్నే రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లాలో విగ్రహాల ధ్వంసానికి ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారం దేవాలయాలపై దాడులు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా, ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామని, వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల విచారణ బాధ్యతను సీఐడీ విభాగానికి అప్పగించామన్నారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవతా విగ్రహమూర్తులపై 2017లో రెండు, 2018లో మూడు, 2019లో ఒకటి, 2020లో 29, ఈ ఏడాది మూడు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. 2019లో నమోదైన కేసులకు సంబంధించి ఆరు చోట్ల గతంలో దెబ్బతిన్న విగ్రహాలను ఇప్పుడు దెబ్బతిన్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్ అర్జునరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. -
లోకేష్‌ను హెచ్చరించిన మంత్రి కొడాలి
సాక్షి, కృష్ణా: రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాములవారి విగ్రహ ధ్వంసంపై మంత్రి కొడాలి ఆదివారం స్పందించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవుడు లాంటి ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో చంద్రబాబు ‘డేరా బాబా’ అవతారం ఎత్తారని విమర్శించారు. రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారని ఫైర్ అయ్యారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి చాలెంజ్ విసరడం విడ్డూరమన్నారు. దొడ్డి దారిన మూడు మంత్రి పదవులు వెలగబెట్టి, జగన్మోహన్రెడ్డి పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. ప్రజల తిరస్కారానికి గురైన బఫూన్, జోకర్ లాంటి లోకేష్ ఛాలెంజ్‌ను సీఎం జగన్మోహన్రెడ్డి స్వీకరించాలనడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పిచ్చివాగుడు కట్టి పెట్టకపోతే సహించేది లేదని, సీఎం జగన్మోహన్రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడితే ఊరికునేది లేదని మంత్రి హెచ్చరించారు. -
వారి డైరెక్షన్లోనే నాపై దాడి: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : రామతీర్థం వద్ద శనివారం కొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లు, వాటర్ ప్యాకెట్లతో తనపై దాడి చేశారని, చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్‌మెన్‌కు గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో నెల్లిమర్ల పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ( రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే? ) అంతకు క్రితం ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ అను’కుల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తాడు. పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలు ససేమీరా విప్పేది లేదంటాడు. భక్తి గురించి, మత విశ్వాసాల గురించి ఈయన ప్రవచనాలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది!’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
రామతీర్థం క్షేత్రానికి మంచి రోజులు
సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామివారి దేవస్థానానికి మంచి రోజులు రానున్నాయి. ఇక్కడ పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వార్షిక ఆదాయం రూ. కోటి నుంచి రూ.20 కోట్లు ఉన్న అన్ని దేవాలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూ ధార్మిక సంస్థ, ట్రస్టుల చట్టం– 1987 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రముఖ దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ఉన్న శ్రీరాముడి దేవాలయానికి కూడా పాలక మండలి ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి ఏర్పాటుతో దేవస్థానానికి మంచి రోజులు రానున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో పెనుమత్స సాంబశివరాజు మంత్రిగా ఉన్నప్పుడు పాలక మండలి ఉండేది. అయితే 2007 నుంచి దేవస్థానానికి పాలక మండలి లేదు. తాజా ఉత్తర్వులు ప్రకారం అక్టోబర్ 20వ తేదీ లోపు ఆసక్తి గల సభ్యులు ఆలయ సహయ కమిషనర్‌కు దరఖాస్తు అందజేయాల్సి ఉంది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఇలా.. నిబంధనల ప్రకారమే నియామకాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేవస్థానానికి ఎక్స్ అఫీషియో సభ్యుడు, తొమ్మిది మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆలయ ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ దేవాలయానికి వ్యవస్థాపక ధర్మకర్తగా మాజీ ఎంపీ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు వ్యవహరిస్తున్నారు. అలాగే నిబంధనల ప్రకారం పాలక మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన జీఓ అందిందని, పూర్తి విధి విధానాలు ఇంకా దేవదాయ, ధర్మదాయ శాఖ నుంచి రావాల్సి ఉందని దేవస్థాన ఉద్యోగి తులసి తెలిపారు. రూ. కోటి పైగా ఆదాయం రామతీర్థం దేవస్థానానికి వార్షిక ఆదాయం రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.80 కోట్లు వస్తుంది. అన్ని వనరులు సక్రమంగా ఉన్నప్పటికీ దేవస్థాన అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పైగా 2007 నుంచి ధర్మకర్తల మండలి లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించేవారనే భక్తుల నుంచి ఆరోపణలు వినిపించేవి. ప్రసాదాల పంపిణీ, తయారీ విషయాల్లోనూ నాణ్యత పాటించకపోవడంపై ఇప్పటికీ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యన్నదానం, స్వామివారి భోగం, పులిహోరా ప్రసాదాల కోసం సరుకుల పంపిణీకి టెండర్లను ఎప్పటికప్పుడు పిలుస్తున్నారు. అయితే ప్రతి ఏటా శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యాపారి టెండర్‌ను దక్కించుకుంటున్నారు. ఈ టెండర్ విధానం వల్ల సరుకులు నాణ్యమైనవి రావడం లేదని ఇక్కడ సిబ్బందే చెబుతుండటం గమనర్హం. అలాగే ప్రస్తుతం దేవస్థానంలో ఉచిత పంపిణీ ప్రసాదం కూడా లేదని భక్తులు రోజూ విమర్శిస్తున్నారు. దేవస్థానంలో కనీసం మినీ వాటర్ ట్యాంక్‌లు కూడా శుభ్రం చేయకపోవడంతో నీటిలో విష పురుగులు దర్శనమిచ్చాయి. గత నెలలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో జిల్లావ్యాప్తంగా సంచలనమైంది. పాలక మండలి ఏర్పాటైతే ఇటువంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉండదని భక్తులు చెబుతున్నారు. -
వైభవంగా రామతీర్థం బ్రహ్మోత్సవాలు
-
రామతీర్థంలో ఘనంగా నవమి వేడుకలు
విజయనగరం: ఆంధ్రా భద్రాద్రి రామతీర్థంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం 10.30 గంటలకు సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజితలగ్న సమయంలో సీతారాముల కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. 11.50 గంటలకు జీలకర్ర,బెల్లం కార్యక్రమం జరిగింది. 12.10 గంటలకు ముత్యాల తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కల్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామనవమి నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే స్వామివారి కళ్యాణం తిలకించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.