రామతీర్థంలో ఘనంగా నవమి వేడుకలు
విజయనగరం: ఆంధ్రా భద్రాద్రి రామతీర్థంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం 10.30 గంటలకు సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజితలగ్న సమయంలో సీతారాముల కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. 11.50 గంటలకు జీలకర్ర,బెల్లం కార్యక్రమం జరిగింది. 12.10 గంటలకు ముత్యాల తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కల్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామనవమి నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే స్వామివారి కళ్యాణం తిలకించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.