ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో ...
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వ�...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుత�...
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ...
Published Thu, Feb 17 2022 1:56 PM | Last Updated on Thu, Feb 17 2022 3:47 PM
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభోత్సవ కార్యక్రమం
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రులు, నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ మీదుగా కేంద్ర మంత్రి, సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ సాగింది.
వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లు బాగుంటే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందని తెలిపారు. చైనాతో పోల్చితే భారత్‌లో రవాణా వ్యయం చాలా ఎక్కువ అని తెలిపారు. త్వరలో డీజిల్ లారీలకు బదులు ఎలక్ట్రిక్ లారీలు, డీజిల్ స్థానంలో సీఎన్జీ, ఎల్పీజీ రవాణా వాహనాలు రానున్నట్లు పేర్కొన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వస్తానని మంత్రి హామీ ఇచ్చారు.. ‘నేను జలవనరుల మంత్రి కాదు.. అయినా పోలవరం చూస్తా’ నని తెలిపారు.
‘ఎంతో మంది నైపుణం ఉన్న యువత ఏపీలో ఉన్నారు. ఇథనాల్ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలి. పెట్రోల్, డీజిల్ వినయోగం బాగా తగ్గాలి. గ్రీన్ హైడ్రోజన్ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం. సీఎం జగన్ ఇచ్చిన ఈస్ట్రన్ రింగ్ రోడ్డుకు ఇప్పుడే ఆమోదం తెలుపుతున్నా. ఏపీలో రూ. 3 లక్షల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తాం. ఏపీలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలను కేంద్రం నిర్మిస్తోంది. 2024 నాటికి రాయపూర్- విశాఖ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి చేస్తాం. పరిశ్రమలతోనే ఉపాధి సాధ్యం. కేంద్ర నిర్వహిస్తున్న గ్రామ సడక్ యోజన ఇప్పుడు అత్యంత కీలకం’ అని తెలిపారు.
పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. దాదర్ ఎక్స్ ప్రెస్ వే తనకు కూడా చాలా ప్రత్యేకమైందని, తన నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి విజయవాడకు రోడ్ వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు.
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్‌పేయి నమ్మారని, వాజ్‌పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి నిర్మాణం జరిగిందని తెలిపారు. కేంద్రం నిర్వహిస్తున్న గ్రామ సడక్ యోజన ఇప్పుడు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి గురువారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని కేంద్రమంత్రి గడ్కరీతో కలిసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు.
బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో వేగంగా పనులు, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో మిగిలిన రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కాసేపట్లో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. మొత్తం ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల ఖర్చయ్యింది. ఫ్లైఓవర్ ప్రారంభంతో బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
సీఎం జగన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
సాక్షి, విజయవాడ: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ ,ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. బీజేపీ తరపున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ ,ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment