తాడేపల్లి: దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
My heartfelt congratulations to Sri @narendramodi garu on taking oath as the Prime Minister of India for the third consecutive term.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2024
ఆదివారం(జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఓత్ ఆఫ్ ఆఫీస్‌తో పాటు ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
Comments
Please login to add a commentAdd a comment