![YS Jagan to hold meet with Guntur YSRCP Leaders on February 12th](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/ys-jagana.jpg.webp?itok=C55jE8qE)
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం కానున్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించడంతో పాటు వైఎస్సార్‌సీపీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment