ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలిపారు. ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ చేయడం వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.
అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ పర్వదినం ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తుచేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
‘‘రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.
రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidMubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 21, 2026


