
సహానా, దస్తగిరమ్మ కుటుంబాలకు పరామర్శ
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్‌కు జగన్ చేరుకుంటారు. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

Comments
Please login to add a commentAdd a comment