
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం డాక్టర్ వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు పంటల బీమా పరిహారం విడుదల చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. దీనివల్ల 15.15 లక్షల మందికి రూ.1820.23 కోట్ల లబ్ది చేకూరనుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ.. ‘‘రేపు 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1310 కోట్లు జమ చేస్తాం. 3,56,093 మందికి సంబంధించి బయోమెట్రిక్, ఇతర సాంకేతిక సమస్యలొచ్చాయి.. సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించి వారి ఖాతాల్లో.. జూన్ మొదటివారంలో రూ.510.23 కోట్లు జమ చేస్తాం’’ అన్నారు.
‘‘ఖరీఫ్‌లో 21 రకాల పంటలకు వాతావరణం ఆధారంగా.. 9 రకాల పంటలకు సంబంధించి 35.75 లక్షల హెక్టార్లకు బీమా కల్పించాం.ఇప్పటివరకు 11,58,907 మంది లబ్దిదారుల వివరాలు బ్యాంక్‌కు చేరాయి’’ అని కన్నబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment