సాక్షి,తాడేపల్లి: పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పాసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్శల కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా @ncbn ? pic.twitter.com/J2jW6kLqyA
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 29, 2024
రైతుల్లో ఆందోళన..
టీడీపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపే అనే విషయం మరోసారి రుజువైంది. వ్యవసాయమంటే దండగ అని గతంలో చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భాలను చూశాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు. దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు విజయవంతంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అమలు చేసింది.
ఆ పథకాన్ని ఎత్తేసి రైతులే పంటల బీమాను చెల్లించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్లు పంటలబీమాను ప్రకటించినప్పుడు తెలుసుకుని వెళ్లి డబ్బులు చెల్లించడం అనేది చాలా కష్టతరమైన పని. ఇలాంటి నేపథ్యంలో పంటల బీమాను రైతులే చెల్లించాలనటం ఎంత వరకు సబబని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment