తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని తాజా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైఎస్సార్‌సీపీ ఈసారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని స్పష్టం చేసింది.
టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైఎస్సార్‌సీపీ విజయం ఏకపక్షమని తెలిపింది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉంది కానీ ఫలితంలో ఏమాత్రం తేడా లేదని తేల్చి చెప్పింది. టీడీపీ 0-1 ఎంపీ స్థానమే గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలకు ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నిరుపేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్న పారదర్శక పాలన వైఎస్సార్‌సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌దే హవా
ఇదిలా ఉంచితే తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే చెప్పగా, బీజేపీ 2 నుంచి మూడు సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 3 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఇతరులు కూడా ఒక సీట్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. గత నెల్లో(సెప్టెంబర్‌లో) నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది టైమ్స్ నౌ.
Times Now-@ETG_Research Survey
— TIMES NOW (@TimesNow) October 2, 2023
Lok Sabha 2024 | Andhra Pradesh: Total Seats: 25
Seat Share:
- YSRCP: 24-25
- TDP: 0-1
- JSP: 0
- NDA: 0
- Others: 0
TDP has to re-invent itself: @ashutosh83B
Jagan Mohan Reddy is delivering his promises: @AbbayaChowdary tells @padmajajoshi pic.twitter.com/Eg6JSYXg8G
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. లక్షల్లో నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్
Comments
Please login to add a commentAdd a comment