Times now siotar survey
-
Times Now Survey : ‘ఫ్యాన్’ ప్రభంజనం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51.10 శాతం ఓట్లను సాధించి 25కిగానూ 25 లోక్‌సభ స్థానాలనూ దక్కించుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది. ఫ్యాన్ తుపాన్లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది. అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క లోక్‌సభ స్థానంలోనూ విజయం సాధించే అవకాశం లేదని.. ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా కనీసం పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. అధికార పార్టీకి మరింత పెరిగిన ఆదరణ దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల అభిప్రాయంపై టైమ్స్ నౌ సంస్థ తాజాగా విస్తృతంగా సర్వే చేసింది. సర్వేకు సంబంధించిన ఫలితాలను సోమవారం రాత్రి టైమ్స్ నౌ చానల్ ప్రసారం చేసింది. విశ్లేషకులతో చర్చ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 24–25 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తుందని సర్వేలో వెల్లడైందని వ్యాఖ్యాత పద్మజాజోషి వెల్లడించారు. గత 52 నెలలుగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని విశ్లేషించారు. అందుకే అధికార పార్టీ 22 లోక్‌సభ స్థానాల నుంచి 25 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని తెలిపారు. The @TimesNow -ETG survey predicts clean sweep for @YSRCParty in AP with 24 -25 Lok Sabha seats.#YSJaganAgain#YSRCPAgainhttps://t.co/G6dY75KvHE — YSR Congress Party (@YSRCParty) October 3, 2023 విశ్వసనీయతకు పట్టం.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే స్థాయికి దారితీసిన పరిస్థితులపై టైమ్స్ నౌ ఛానల్ చర్చ నిర్వహించింది. సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి ప్రధాన కారణమేంటని చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. సీఎం జగన్ ఏదైనా చెప్పారంటే చేస్తారనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన.. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తుండటం.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణల ద్వారా అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. దీన్ని చంద్రబాబు పాలనతో పోల్చుకుంటున్న ప్రజలు సీఎం జగన్‌తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నారని, అందుకే 25కుగానూ 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నది సర్వే ద్వారా తేలిందన్నారు. ఫలించని సానుభూతి డ్రామా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబును జైలుకు పంపడం వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి ఏమైనా కనిపిస్తోందా? అని చర్చలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ అశుతోష్‌ను వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. దీనిపై అశుతోష్ స్పందిస్తూ.. అవినీతి కేసులో రిమాండ్‌పై జైలులో ఉన్న చంద్రబాబు పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుభూతి కనిపించడం లేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడటం వల్లే ఇప్పుడు ప్రజల్లో ఆయన పట్ల సానుకూల అభిప్రాయం లేదని విశ్లేషించారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపారని నారా లోకేష్‌తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఇప్పటికైనా మార్పు రావాలని, ఆయన వైఖరిపై పునరాలోచించుకోవాలని సూచించారు. 2019 కంటే మిన్నగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ద్వారా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం జగన్ దేశం దృష్టిని ఆకర్షించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథాన అగ్రభాగాన నిలబెట్టారు. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత 52 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.36 లక్షల కోట్లను జమ చేశారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడమే అందుకు తార్కాణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2019 ఎన్నికల కంటే మిన్నగా అంటే 51.10 శాతం ఓట్లతో 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘వైనాట్ 175..?’ అని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న అంశాలకు ఈ సర్వే ఫలితాలు దగ్గరగా ఉండటం గమనార్హం. -
Times Now Survey : 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ సునామీ
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని తాజా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైఎస్సార్సీపీ ఈసారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైఎస్సార్సీపీ విజయం ఏకపక్షమని తెలిపింది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉంది కానీ ఫలితంలో ఏమాత్రం తేడా లేదని తేల్చి చెప్పింది. టీడీపీ 0-1 ఎంపీ స్థానమే గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నిరుపేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్న పారదర్శక పాలన వైఎస్సార్సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్దే హవా ఇదిలా ఉంచితే తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే చెప్పగా, బీజేపీ 2 నుంచి మూడు సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 3 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఇతరులు కూడా ఒక సీట్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. గత నెల్లో(సెప్టెంబర్‌లో) నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది టైమ్స్ నౌ. Times Now-@ETG_Research Survey Lok Sabha 2024 | Andhra Pradesh: Total Seats: 25 Seat Share: - YSRCP: 24-25 - TDP: 0-1 - JSP: 0 - NDA: 0 - Others: 0 TDP has to re-invent itself: @ashutosh83B Jagan Mohan Reddy is delivering his promises: @AbbayaChowdary tells @padmajajoshi pic.twitter.com/Eg6JSYXg8G — TIMES NOW (@TimesNow) October 2, 2023 ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. లక్షల్లో నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్ -
ఐదు రాష్ట్రాల్లో అధికారం ఆ పార్టీలదే..
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్లో ఆ పార్టీకి విజయం దక్కకపోవచ్చని ‘టైమ్స్ నౌ – సీ ఓటర్’ సర్వే పేర్కొంది. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నా మెజారిటీ స్థానాలను గెల్చుకోలేదని తేల్చింది. 2016లో సాధించిన సీట్ల కన్నా తక్కువే గెల్చుకున్నప్పటికీ మెజారిటీకి అవసరమైన సీట్లను టీఎంసీ గెల్చుకుంటుందని పేర్కొంది. తమిళనాడులో డీఎంకే, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తా్తయని వెల్లడించింది. అస్సాంలో ఎన్డీఏ, కేరళలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని వివరించింది. పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, చివరకు విజయం మాత్రం మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ భారీగా బలపడుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, బీజేపీ 104 నుంచి 120 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమికి 18 – 26 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. స్వతంత్రులు రెండు స్థానాలు గెల్చుకోవచ్చని పేర్కొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లను గెల్చుకుని ఘనవిజయం సాధించగా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది 3 సీట్లలోనే కావడం గమనార్హం. ఓట్ల శాతంలో బీజేపీ, టీఎంసీల మధ్య తేడా పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ 42.1%, బీజేపీ 37.4% ఓట్లు గెల్చుకుంటాయని తేల్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమికి 13% ఓట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలుస్తుందని 44.6%, బీజేపీ గెలుస్తుందని 36.9% అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా మమత బెనర్జీనే సరైన వ్యక్తి అని 55% మంది, రాష్ట్ర బీజేపీ చీఫ్ గౌతమ్ ఘోష్ సీఎంగా సరైన వ్యక్తి అని 32.3% అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ 3వ వారంలో 17850 మంది నుంచి ‘టైమ్స్ నౌ – సీ ఓటరు’ అభిప్రాయాలు సేకరించింది. తమిళనాడు: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి యూపీఏ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ.. ఆ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే, బీజేపీల ఎన్డీఏ 45 నుంచి 53 సీట్లు మాత్రమే గెల్చుకుంటుందని పేర్కొంది. ఎంఎన్ఎం, ఏఎంఎంకే 3 చొప్పున సీట్లు గెల్చుకుంటాయని, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది. మార్చ్ 17 – 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8709 మందిపై ఈ సర్వే జరిపారు. యూపీఏకు 46%, ఎన్డీఏకు 34.6% ఓట్లు వస్తాయని తేల్చింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 136 సీట్లు, యూపీఏకు 98 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లను టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే గణనీయంగా చీలుస్తుందని 39% అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్‌కు 43.1% మంది మద్దతు పలకగా, పళనిసామి(అన్నాడీఎంకే)కు 29.7% మంది, శశికళకు 8.4% మంది ఓటేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అస్సాం: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఎన్డీయేకు 69 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 56 సీట్లు వస్తాయని, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. అస్సాంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45%, యూపీఏకు 41.1% ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత సీఎం శర్బానంద సొనోవాల్కు 46.2% మంది, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయి 25.2% మంది మద్దతు పలికారు. కేరళ: ఈ ఎన్నికల్లో వామపక్ష ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ, సీ ఓటరు సర్వే వెల్లడించింది. మొత్తం 140 స్థానాలకు గానూ, మెజారిటీ కన్నా స్వల్పంగా అధికంగా 77 సీట్లను ఎల్డీఎఫ్ గెల్చుకుంటుందని పేర్కొంది. 2016లో గెల్చుకున్న సీట్ల కన్నా ఇది 14 సీట్లు తక్కువ. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ 62 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. 42.4% ఓట్లను ఎల్డీఎఫ్, 38.6% ఓట్లను యూడీఎఫ్ గెల్చుకుంటాయని పేర్కొంది. సీఎం క్యాండిడేట్‌గా ముఖ్యమంత్రి విజయన్‌కు 39.3% ఓటేయగా, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి 26.5% మద్దతిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పనితీరుకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. పుదుచ్చేరి: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు తేల్చింది. బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేల ఎన్డీఏ మొత్తం 30 స్థానాలకు గానూ 21 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే కాంగ్రెస్‌ల యూపీఏకు 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 47.2% , యూపీఏకు 39.5% ఓట్లు వస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగసామికి 49.2% మంది మద్దతు పలికారు. -
బెంగాల్లో ‘దీదీ’నే!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంల్లో అధికార కూటమే విజయం సాధిస్తుందని టైమ్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అయితే, 2016 కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. అక్కడ బీజేపీ బలం పుంజుకున్నప్పటికీ.. అధికారం చేపట్టే స్థాయికి చేరుకోలేదని అంచనా వేసింది. పశ్చిమబెంగాల్లో..: వరుసగా మూడోసారి పశ్చిమబెంగాల్ పీఠంపై ‘దీదీ’మమత బెనర్జీనే కూర్చోనుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, గతంలో కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 146 నుంచి 162 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాలతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్లో మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2016 ఎన్నికల్లో మూడే స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 నుంచి 115 స్థానాలను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ తేల్చింది. కాగా, కాంగ్రెస్–వామపక్షం–ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపబోదని, ఆ కూటమికి 29 నుంచి 37 సీట్లు రావచ్చని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తేల్చింది. ఓట్ల శాతం విషయానికి వస్తే టీఎంసీకి 42.2%, బీజేపీకి 37.5%, కాంగ్రెస్ కూటమికి 14.8% ఓట్లు వస్తాయంది. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 10.2% ఓట్లు సాధించిన విషయం గమనార్హం. తమిళనాడులో..: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. ఈ కూటమి 158 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. మరోవైపు, అన్నాడీఎంకే – బీజేపీల ఎన్డీఏ 65 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని వెల్లడించింది. యూపీఏ 43.2%, ఎన్డీఏ 32.1% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో యూపీఏ 98 సీట్లలో, ఎన్డీఏ 136 సీట్లలో గెలుపొందాయి. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కు మెజారిటీ ప్రజలు ఓటేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో స్టాలిన్‌ను 38.4%, పళనిసామిని 31%, కమల్‌హాసన్‌ను 7.4%, రజనీకాంత్‌ను 4.3%, పన్నీరుసెల్వంను 2.6%, శశికళను 3.9% మంది ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగాలేదని 53.26% ప్రజలు అభిప్రాయపడగా, 34.35% సంతృప్తి వ్యక్తం చేశారు. అస్సాంలో..: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్వల్ప మెజారిటీతో అధికారం నిలుపుకుంటుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ల కారణంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగినప్పటికీ కొద్ది మెజారిటీతో ఎన్డీఏ గట్టెక్కుతుందని అంచనావేసింది. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 67 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 57 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. 2016 ఎన్నికల్లో ఎన్డీఏ 74, యూపీఏ 39 సీట్లు గెలుచుకున్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 42.29% ఎన్డీఏకు, 40.7% యూపీఏకు ఓటేస్తామన్నారని వెల్లడించింది. సీఏఏ, ఎన్ఆర్సీల కారణంగా యూపీఏ గణనీయంగా లాభపడిందని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్‌కు 45.2% మద్దతు పలికారు. రెండో స్థానంలో కాంగ్రెస్ నేత సౌరవ్ గొగోయి ఉన్నారు. కాగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పనితీరుపై దాదాపు 70% సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కేరళలో..: కేరళలో వామపక్ష కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. మొత్తం 140 సీట్లకు గానూ అధికార ఎల్డీఎఫ్ 82 సీట్లను, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ 56 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఎల్డీఎఫ్ 42.9%, యూడీఎఫ్ 37.6% ఓట్లను సాధిస్తాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 91, యూడీఎఫ్ 47 సీట్లను గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌పై 42.34% పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్నవారిలో 55.84% కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలపడం విశేషం. ప్రధానిగా మోదీకి వారిలో 31.95% మాత్రమే మద్దతిచ్చారు. పుదుచ్చేరిలో..: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే వెల్లడించింది. మొత్తం 30 స్థానాలకు గానూ 18 స్థానాలను ఎన్డీఏ గెల్చుకుంటుందని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45.8%, యూపీఏకు 37.6% ఓట్లు వస్తాయని తెలిపింది. 2016లో కాంగ్రెస్ – డీఎంకేల కూటమి 17 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 12 సీట్లు గెలుచుకుంది. -
బిహార్‌లో ఎన్డీఏదే విజయం!
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే విజయమని ‘టైమ్స్‌నౌ–సీ ఓటర్’ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లలో ఈ కూటమి 160 వరకు స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. ఎన్డీఏలోని బీజేపీ 80 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అదేవిధంగా, మరో పెద్ద పార్టీ నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ 70 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని తేలింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలతో ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) 76 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 32 శాతం మంది మళ్లీ నితీశ్‌కుమారే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. సీఎంగా నితీశ్ పనితీరు మంచిగా ఉందని 28.7 శాతం మంది తెలపగా మామూలుగా ఉందని 29.2%, బాగోలేదని 42.0% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 1–10 తేదీల మధ్య 243 నియోజకవర్గాలకు చెందిన 12,843 మంది నుంచి టెలిఫోన్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ జరిపారు. రెబల్ అభ్యర్థులపై బీజేపీ వేటు: పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుగుబాటు అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతలను బీజేపీ బహిష్కరించింది. మొత్తం 9 మందిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. వీరిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటుదారుల్లో చాలామంది బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నారు. -
నమో నమ:
2014లో ప్రధాని పీఠాన్నిచ్చిన యూపీలో ఈసారి బీజేపీకి భారీ దెబ్బ తప్పదు.. మమత, అఖిలేశ్–మాయావతి, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ జోరును విజయవంతంగా అడ్డుకుంటారు.. మొన్నటివరకు వెన్నంటి ఉన్న హిందీబెల్ట్ ఈసారి బీజేపీకి మొహం చాటేయడం ఖాయం.. మోదీ మళ్లీ ప్రధాని కావడం దాదాపుగా అసంభవం.. మోదీ, అమిత్ షా ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.. ఇదీ ఏడు విడతల వారీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు. కానీ ఈ అంచనాలేవీ నిజం కాకపోవచ్చని.. మోదీ మరోసారి స్పష్టమైన మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని పోస్ట్‌పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం 300 సీట్లతో ఎన్డీయే రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఏడుదశల్లో హోరాహోరీగా జరిగిన పోరులో.. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన పోటీని తట్టుకుని మరీ మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని అభిప్రాయపడ్డాయి. ప్రధానిగా మోదీ పనితీరుకు, కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి, ప్రాంతీయ పార్టీల సత్తాకు అసలు సిసలు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకే జై కొట్టబోతున్నారని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థల సర్వే ఫలితాల్లోనూ ఎన్డీయే మేజిక్ ఫిగర్ (272)ను దాటి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడైంది. 2014 ఎన్నికల్లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్ గతంలో కంటే కాస్త మెరుగుపడినా.. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన 542 స్థానాలకు గానూ బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభావవంతంగా మహా ఘట్బంధన్ అత్యంత కీలమైన మహారాష్ట్ర సహా హిందీ బెల్ట్‌లోని గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడిస్తున్నాయి. మోదీ వర్సెస్ దీదీ రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోనుందని.. తృణమూల్‌కు గట్టిపోటీ ఇచ్చిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక స్థానాలున్న (80 ఎంపీలు) ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మహాఘట్బంధన్ ప్రభావం స్పష్టంగా ఉందని పలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి 40 సీట్ల వరకు రావొచ్చని అభిప్రాయపడ్డాయి. అయితే యూపీలో కోల్పోయే సీట్ల నష్టాన్ని పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కొంతమేరనైనా పూడ్చుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. ప్రియాంక, రాహుల్ ప్రభావమేదీ? గతేడాది చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం, కాంగ్రెస్ బలం పుంజుకోవడం, మోదీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు, వ్యవసాయ సంక్షోభం, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మొదలైన కారణాలతో మోదీకి ఎదురుగాలి వీస్తోందనే చర్చ మొదలైంది. బాలాకోట్ దాడుల ప్రభావం బీజేపీకి నైతిక బలాన్నిస్తుందని భావించినప్పటికీ.. వ్యవసాయరంగ సమస్యలు, నిరుద్యోగుల్లో అసంతృప్తి వంటివాటిపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిసారించింది. దీంతో బీజేపీకి ఎదురుగాలి తప్పదని.. పరిశీలకులు అంచనా వేశారు. ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్‌కు బలాన్నిస్తుందని భావించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 336 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్‌కు 59, ఇతరులకు 148 సీట్లు వచ్చాయి. అయితే, మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని, రాహుల్‌గాంధీ, ప్రియాంకలు అనుకున్నంతగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. దక్షిణభారతంలో మాత్రం బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేదని.. మొత్తంగా 30 స్థానాల్లోపే ఉండొచ్చని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకే మెజారిటీ వస్తుందని మెజారిటీ సంస్థలు స్పష్టం చేశాయి. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ 18–20 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి. దేశానికి నిస్వార్థం, అంకితభావంతో సేవలు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి సానుకూలంగా భారీగా పోలింగ్ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. సుపరిపాలన అందించిన మోదీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. మోదీపై నిరాధార ఆరోపణలు, అబద్ధాలు చెప్పిన ప్రతిపక్షాలు ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివి. –జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూ ఎదురుచూస్తాం. – శశిథరూర్, కాంగ్రెస్ రిపబ్లిక్ టీవీ డబుల్ ఎగ్జిట్ పోల్ మళ్లీ ఎన్డీయేనే..! 17వ లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే పట్టం కట్టనున్నారని ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ రిపబ్లిక్‌టీవీ సీ–ఓటర్, జన్ కీ బాత్ సంస్థలతో కలసి నిర్వహించిన డబుల్ ఎగ్జిట్ పోల్ జోస్యం చెప్పింది. రిపబ్లిక్సీ–ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ 287 సీట్లు (42.3% ఓట్లు), కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 128 స్థానాలు (28.1% ఓట్లు), యూపీ లోని బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాగఠ్ బంధన్ 40 సీట్లు, రెండు కూటముల్లో లేని ఇతర పార్టీలు 87 సీట్లు గెలుచుకోనున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు 336 సీట్లు రాగా ఈసారి 49 సీట్లు తగ్గుతా యని ఈ సర్వే జోస్యం చెబుతోంది. మరోవైపు రిపబ్లిక్– జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏ 305 (45.5%), యూపీఏ 124 (24.5%), మహాఘట్బంధన్కు 26 సీట్లు సాధిస్తాయని తేలింది. యూపీలో బీజేపీ x మహాకూటమి ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి 38, మహాకూటమికి 40, కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని రిపబ్లిక్–సీ ఓటర్ సర్వే అంచనా వేయగా రిపబ్లిక్–జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 46–57 సీట్లు, మహాకూటమి 21–32 సీట్లు, కాంగ్రెస్ 2–4 సీట్లు వస్తాయని పేర్కొంది. మహరాష్ట్రలోని 48 సీట్లలో బీజేపీ–శివసేన కూటమికి 34, యూపీఏకు 14 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్–సీ ఓటర్ సర్వే పేర్కొంది. బీజేపీ–శివసేన కూటమికి 34–39, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన యూపీఏకు 8–12 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్–జన్ కీ బాత్ సర్వేలో అంచనా వేశారు. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు 29, బీజేపీకి 11, కాంగ్రెస్‌కు రెండు సీట్లు దక్కుతాయని సీ–ఓటర్–రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 18–26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13–21, కాంగ్రెస్‌కు మూడు సీట్లు వస్తాయని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కమలం స్వీప్ మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీకి 24, కాంగ్రెస్‌కు 5 స్థానాలు లభిస్తాయని సీ–ఓటర్ సర్వే, బీజేపీ 21–24, కాంగ్రెస్‌కు 5–8 సీట్లు గెలుచుకుంటాయని జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. అలాగే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న 26 ఎంపీ సీట్లలో బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కుతాయని సీ–ఓటర్ ఎగ్జిట్ పోల్, బీజేపీకి 22–23, కాంగ్రెస్‌కు 3–4 సీట్లు దక్కుతాయని జన్‌కీబాత్ సర్వేలు జోస్యం చెప్పాయి. 40 సీట్లున్న బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏకు 33, ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలున్న ప్రతిపక్ష కూటమికి 7 సీట్లు లభిస్తాయని సీ–ఓటర్ సర్వే జోస్యం చెప్పింది. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 28–31, ఆర్జేడీ కూటమికి 11–8 ఇతరులకు ఒక సీటు వస్తాయని అంచనా వేశారు. కర్ణాటకలో కాషాయపక్షానిదే హవా 28 సీట్లున్న కర్ణాటకలో బీజేపీకి 18, కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 9 సీట్లు లభిస్తాయని, ఓ సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకుంటారని సీ–ఓటర్ సర్వే, బీజేపీకి 18–20, కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 10–7 సీట్లు దక్కుతాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సూచిస్తున్నాయి. తమిళనాడులో పోలింగ్ జరిగిన 38 సీట్లలో కాంగ్రెస్, డీఎంకేతో కూడిన యూపీఏకు 27, బీజేపీ, ఏఐడీఎంకేతో కూడిన ఎన్డీఏకు 11 సీట్లు వస్తాయని సీ–ఓటర్ సర్వే తెలిపింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 9–13, యూపీఏకు 15–29 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. టైమ్స్ నౌ టీవీ చానల్ వీఎంఆర్ సంస్థతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 542 ఎంపీ స్థానాలకుగాను 306 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,211 ప్రత్యేక ప్రాంతాల్లో తాము సుమారు 40 వేల మందితో శాంపిల్ సేకరించామని, భౌగోళిక, ఓటింగ్ సరళిలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసిన మరో 40 వేల మంది నుంచి సమాచారం సేకరించిన తరువాత తుది అంచనాకు వచ్చామని టౌమ్స్ నౌ వెల్లడించింది. తొలిదశ పోలింగ్ మొదలైన ఏప్రిల్ 11 నుంచి ఆదివారం జరిగిన తుది విడత వరకు సమాచార సేకరణ జరిగిందని తెలిపింది. తుది అంచనాల ప్రకారం ఎన్డీయే 306 స్థానాలు గెలుచుకోనుండగా యూపీఏ 132స్థానాలకు పరిమితం కానుంది. అదే సమయంలో ఇతర పార్టీలు మొత్తం 104 స్థానాల్లో విజయం సాధించ వచ్చు. కూటముల వారీగా ఓటింగ్ శాతాన్ని గమనిస్తే ఎన్డీయే 41.1% ఓట్లు కైవసం చేసుకోనుండగా యూపీఏ 31.7, ఇతర పార్టీలు 27.2 % ఓట్లు సాధిస్తాయని తెలిపింది. యూపీలో బీజేపీకి 58 సీట్లు దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 58 స్థానాలు సాధిస్తుందని, కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు పరిమితమవు తుందని టైమ్స్ నౌ–వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ లెక్క గట్టింది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎస్ఎల్పీలతో కూడిన మహాఘట్ బంధన్ 20 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో టైమ్స్ నౌ–వీఎంఆర్ అంచనాల ప్రకారం బీజేపీ 11 స్థానాలు గెలుచుకోవచ్చు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. మొత్తం 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి 38 స్థానాల్లో విజయం సాధించనుండగా.. కాంగ్రెస్– ఎన్సీపీల కూటమి పది స్థానాలు గెలుచుకోనుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ అత్యధికంగా 23 స్థానాలు గెలుచుకోనుంది. కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితం కానుంది. తమిళనాడు విషయానికొస్తే డీఎంకే 29 స్థానాలు, ఏఐఏడీఎంకే తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీయేకి 300 వరకు సీట్లు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 300 వరకు సీట్లతో ఎన్డీయే సునాయాస విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. యూపీఏ 127, ఇతర పార్టీలు 123 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అత్యధిక స్థానా ల్లో విజయం సాధించనున్నట్లు అంచనా వేశాయి. హరియాణ, అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రా ల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లలో బీజేపీకి 49 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీ, ఎస్పీల కూటమి 29 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో (42 సీట్లు) 2014 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి 14 సీట్లతో రెండంకెలకు చేరుకోనుంది. టీఎంసీకి 26, కాంగ్రెస్‌కు 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్రలో (48 సీట్లు) బీజేపీ–శివసేనల విజయం సుస్పష్టమవుతోంది. ఒడిశాలో (21) మాత్రం బీజేపీ (10), అధికార బిజూ జనతాదళ్ (10) మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించే అవకాశం ఉంది. తమిళనాడులో (38) బీజేపీ, ఏఐఏడీఎంకేల కూటమికి 11, డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి 27 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బిహార్‌లో (40) బీజేపీ, జేడీయూలు 32 సీట్లలో విజయకేతనం ఎగురవేయనున్నాయి. గుజరాత్లో (మొత్తం 26) 23 సీట్లతో, రాజస్తాన్‌లో (25) 22 సీట్లతో బీజేపీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. కర్ణాటక.. కాషాయానిదే హవా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలకు ఊపునిచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల అనంతరం జట్టు కట్టిన కాంగ్రెస్ జేడీఎస్‌లు ఒకవైపు.. బీజేపీ మరోవైపు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందంటున్నాయి. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరక్కపోవడంతోపాటు.. ఇరు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు కూటమికి మైనస్ కానుంది. దీనికితోడు కర్ణాటకలోని తీర ప్రాంతంలో బీజేపీ పట్టు కొనసాగడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు గెలుచుకోగా, వీటిల్లో అత్యధికం కోస్తా ప్రాంతం నుంచే రావడం గమనార్హం. తమిళనాడు .. డీఎంకేకు జై ప్రాంతీయ పార్టీల కలగూర గంప తమిళనాడులో ఈసారి డీఎంకే పూర్తి అధిపత్యం కనబరుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పాయి. మొత్తం 38 స్థానాలుండగా.. వెల్లూరు లోక్‌సభ స్థానం పోలింగ్ వాయిదా (భారీగా డబ్బు పట్టుబడడంతో) పడింది. కాంగ్రెస్, డీఎంకేతో సహా పలు పార్టీలకు యూపీయే కూటమిగా.. ఏఐఏడీఎంకే, పలు చిన్న పార్టీలతో బీజేపీ మరో కూటమిగా బరిలో నిలిచింది. ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. డీఎంకే కూటమి 34–38 స్థానాల్లో.. బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి గరిష్టంగా 5చోట్ల గెలవొచ్చని తెలుస్తోంది. న్యూస్ 18– ఐఎస్పీఎస్ఓస్ అంచనా కాస్త భిన్నంగా ఉంది. ఈ సర్వే డీఎంకే 22–24 స్థానాలు.. బీజేపీ–ఏఐఏడీఎంకే 14–16 స్థానాలను అంచనావేస్తోంది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణం తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. కేరళ.. కాంగ్రెస్‌కు బలం దశాబ్దాలుగా తమను గెలిపిస్తున్న అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని చాలామంది తప్పుపట్టినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే అతడి నిర్ణయం సరైందే అనిపించకమానదు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోగలదని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ చెబుతూండటం ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. యూడీఎఫ్ 15 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 3స్థానాలు ఎక్కువ. ఇదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 3చోట్ల బీజేపీ ఒకచోట గెలిచే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. బెంగాల్.. దీదీ కోటకు బీటలు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కోటలోకి చొరబడాలన్న కమలనాథుల ఆశ నెరవేరనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో మమత ఆధ్వర్యంలోని తృణమూల్‌కు 24–28 సీట్లు వస్తాయని, బీజేపీ 14 సీట్లలో జయకేతనం ఎగురవేసే అవకాశం ఉందని సర్వేలంటున్నాయి. 2014 ఎన్నికల్లో తృణమూల్ 34 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి కేవలం 2 స్థానాలే దక్కాయి. అయితే ప్రధాని మోదీ ఏకంగా రాష్ట్రంలో 17 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారంటే బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో పోలింగు హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, సీపీఎం శ్రేణులు పరోక్షంగా బీజేపీకి సహకరించడం మమతకు నష్టం కలిగించి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర.. ఎన్డీయేదే పైచేయి దేశంలో యూపీ తర్వాత రెండో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే 38–42 సీట్లు.. యూపీయే 6–10 చోట్ల గెలుస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 42 సీట్లు గెలుచుకుంది. బీజేపీ–శివసేనల విభేదాలను అనుకూలంగా మలుచుకోవాలన్న కాంగ్రెస్ ఆశ నెరవేరలేదు. పుల్వామా దాడి, బాలాకోట్ సర్జికల్ దాడుల నేపథ్యంలో బీజేపీ–శివసేన విజయం సాధిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. గుజరాత్.. బీజేపీ క్లీన్ స్వీప్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలోని 26 లోక్‌సభ సీట్లలో.. బీజేపీకి 25 సీట్లు రావచ్చని న్యూస్18–ఐపీఎస్వోఎస్ సర్వేలో వెల్లడయింది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ సర్వే వెల్లడించింది. న్యూస్ 24–చాణక్య సర్వే ప్రకారం బీజేపీ మొత్తం 26 సీట్లలోనూ జయకేతనం ఎగురవేయనుంది. ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో కాంగ్రెస్‌కు ఒక సీటు రావచ్చని వెల్లడయింది. 2014 ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలూ బీజేపీకే దక్కాయి. యూపీ.. మహాఘట్బంధన్ సత్తా అత్యధిక లోక్‌సభ సీట్లున్న యూపీలోని 80 సీట్లలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని టైమ్స్ నౌ (58), రిపబ్లిక్ టీవీ–జన్‌కీబాత్ (53), ఇండియాటుడే (62–68) ఎగ్జిట్‌పోల్స్ సూచిస్తున్నాయి. కాగా, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ మహాఘట్బంధన్కు 20 స్థానాలకు పైనే దక్కుతాయని టైమ్స్ నౌ (20), జన్‌కీ బాత్ (24), సీ–ఓటర్ (40), న్యూస్ ఎక్స్ (41), నీల్సన్ (56) అంచనావేశాయి. ఎగ్జిట్‌పోల్ అంచనాల ప్రకారం ఎస్పీ–బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ బాగానే జరిగిందనీ, ఎస్సీ, బీసీలతోపాటు ముస్లింలు పెద్ద సంఖ్యలో కూటమికి ఓట్లేశారని అర్థమౌతోంది. కాంగ్రెస్‌కు 2–4 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. బిహార్.. ఎన్డీయే కూటమిదే.. బిహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మూడొంతులకు పైగా సీట్లు లభిస్తాయని మెజారిటీ సర్వేలు సూచిస్తున్నాయి. 40 లోక్‌సభ సీట్లున్న బిహార్‌లో ఎన్డీయే కూటమికి టైమ్స్ నౌ (30 సీట్లు), సీ–ఓటర్ (33), జన్‌కీ బాత్ (29) సీట్లు రావొచ్చని సర్వేలు అంచనావేశాయి. యూపీయే మహాకూటమికి 7–10 సీట్లే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. లాలూ యాదవ్ జైల్లో ఉండడం, కుటుంబంలో విబేధాల కారణంగా ఆర్జేడీకి ఓటేయలేదని తెలుస్తోంది. రాజస్తాన్.. 20కి పైనే 2014లో రాజస్తాన్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి కూడా 20కి పైగానే స్థానాలు కాషాయపక్షం గెలుచుకుంటుందని ఇండియా టుడే (22), టైమ్స్–నౌ (21), సీ–ఓటర్(22), టుడేస్ చాణక్య (25), ఏబీపీ నీల్సన్ (19) వస్తాయని అంచనావేశాయి. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గరిష్టంగా ఆరుకు మించి సీట్లు రావనే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. రాజస్తాన్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజేపై వ్యతిరేకతతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే మోదీ మళ్లీ ప్రధాని కావాలని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని భారీ స్థాయిలో గెలిపిస్తున్నారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్‌లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే గాలి వీస్తుండగా ఒడిశాలో (21 సీట్లు) మాత్రం బీజేపీ పక్షాలు, బిజూ జనతాదళ్ మధ్య పోటాపోటీ వాతావరణం కన్పిస్తోంది. ఎన్డీటీవీ బీజేడీ, బీజేపీలకు చెరో 10, కాంగ్రెస్‌కు 1 సీటు వస్తుందని అంచనా వేస్తే, సీఓటర్ బీజేడీకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య మాత్రం బీజేపీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో (29 సీట్లు) బీజేపీ గాలి వీస్తుండటం గమనార్హం. ఎన్డీటీవీ, సీఓటర్, టైమ్స్ నౌ మూడూ బీజేపీ 24 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపాయి. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్‌షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్‌కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్‌కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్‌కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► బాగేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్‌కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్‌కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్‌పోల్‌లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్‌జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్‌సింగ్‌తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం రమణ్‌సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్‌లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌లో నువ్వా–నేనా ఛత్తీస్‌గఢ్‌లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్‌లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్‌లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్‌లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
బిహార్‌లో హోరాహోరీ
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొందని తాజా సర్వేలు చెబుతున్నాయి. గురువారం రాత్రి ప్రసారమైన టైమ్స్ నౌ- సీఓటర్ సర్వే ఎన్డీయేకు 117 సీట్లు, మహాకూటమికి 112 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రెండుపక్షాల మధ్య ఓట్లలో ఒక శాత మే తేడా ఉంది. ఎన్డీయేకు 43 శాతం, మహా కూటమికి 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఇతరులు 14 సీట్లు గెలుస్తారని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో మొత్తం 7,786 మంది శాంపిల్స్‌ను ఈసర్వే తీసుకుంది. వీరిలో 46.8 శాతం మంది నితీష్ కుమారే మళ్లీ సీఎం కావాలను కుంటున్నట్లు చెప్పారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించనప్పటికీ, బీజేపీ నేత సుశీల్ మోదీకి 16 శాతం మంది సీఎంగా పట్టం కట్టారు. 6.7 శాతం మాంఝీని కోరుకోగా, షానవాజ్ హుస్సేన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 5.4 శాతం మంది చెప్పారు. అలాగే ఇండియా టీవీ-సీఓటర్ సర్వే... ఎన్డీయేకు 109-125 సీట్లు, మహా కూటమి 104-120 వస్తాయని అంచనా వేసింది.