న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొందని తాజా సర్వేలు చెబుతున్నాయి. గురువారం రాత్రి ప్రసారమైన టైమ్స్ నౌ- సీఓటర్ సర్వే ఎన్డీయేకు 117 సీట్లు, మహాకూటమికి 112 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రెండుపక్షాల మధ్య ఓట్లలో ఒక శాత మే తేడా ఉంది. ఎన్డీయేకు 43 శాతం, మహా కూటమికి 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఇతరులు 14 సీట్లు గెలుస్తారని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది.
బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో మొత్తం 7,786 మంది శాంపిల్స్‌ను ఈసర్వే తీసుకుంది. వీరిలో 46.8 శాతం మంది నితీష్ కుమారే మళ్లీ సీఎం కావాలను కుంటున్నట్లు చెప్పారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించనప్పటికీ, బీజేపీ నేత సుశీల్ మోదీకి 16 శాతం మంది సీఎంగా పట్టం కట్టారు. 6.7 శాతం మాంఝీని కోరుకోగా, షానవాజ్ హుస్సేన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 5.4 శాతం మంది చెప్పారు. అలాగే ఇండియా టీవీ-సీఓటర్ సర్వే... ఎన్డీయేకు 109-125 సీట్లు, మహా కూటమి 104-120 వస్తాయని అంచనా వేసింది.
బిహార్‌లో హోరాహోరీ
Published Fri, Sep 25 2015 1:12 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM
Advertisement