విజయవాడ: వరద బాధితులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష కొనసాగుతుంది. నిరాహార దీక్షలో వరద బాధితులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.
వరద బాధితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ కదిలింది: దేవినేని అవినాష్
వరద బాధితులకు అన్ని విధాల తోడుగా ఉండడానికి నిరాహార దీక్ష చేస్తున్నాం
వరద బాధితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ కదిలింది
చంద్రబాబు వల్లనే వరదలు వచ్చాయి
మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సింగినగర్, ఇతర ప్రాంతాలు వరదల్లో ప్రజలు ఉన్నారు
వరదల్లో నష్టపోయిన వారికి ఒక్కరికి నష్ట పరిహారం అందించలేదు
రోజు కలెక్టరేట్ వద్ద వరద బాధితులు పడిగాపులు పడుతున్నారు
వరద బాధితులకు నష్ట పరిహారం అడుగుతుంటే వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతున్నారు
ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప కూటమి నేతలు చేసింది ఏమీ లేదు
రూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది
అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఎమీ చేయడం లేదు
కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాంది
వైఎస్సార్‌సీపీ కోటి కాదు.. రూ. కోటి 50 లక్షలు ఖర్చు పెట్టింది
50వేల కుటుంబాలను సరుకులు పంపిణీ చేసింది
మా లెక్కలు మేము ఇస్తాం.మీరు ఖర్చు పెట్టిన దానికి లెక్కలు ఇవ్వగలరా?
వరదలను చూపెట్టి వందల కోట్లు వసూళ్లు చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్ప్రజల ఆర్భాటాలు కోసమే చంద్రబాబు ప్రయత్నం చేశాడు
సంక్షోభంలో చంద్రబాబు అవకాశాలు వెతుక్కుంటాడు.. ఇప్పుడు అవినీతి చేస్తున్నారు
ఎంత ఖర్చు పెట్టారో మంత్రులు చెప్పలేకపోతున్నారు..ఆర్‌టీఏ అప్లయి చేసుకోమంటున్నారు
విజయవాడ ఇమేజీని డ్యామేజ్ చేసింది కూటమి ప్రభుత్వం
కుమ్మరి పాలెం, ఊర్మిళ నగర్, హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఒకరికి నష్ట పరిహారం అందలేదు
చెప్పిన మాట ప్రకారం వైఎస్ జగన్ కోటి కాదు.. కోటిన్నర ఖర్చు చేశారు
వైఎస్ జగన్‌ని చూసి కూటమి నేతలు సిగ్గు తెచ్చు కోవాలి
కలెక్టరేట్‌లో అప్లికేషన్లు అమ్ముకుంటున్న చరిత్ర కూటమి ప్రభుత్వంది
వరద బాధితులకు చివరి వ్యక్తి వరకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం
కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదు: మల్లాది విష్ణు
రూ. 534 కోట్ల రూపాయిలు వరద బాధితులకు నష్ట పరిహారం అందించినట్లు అధికారులు లెక్కలు చెప్పారు
ప్రతి దేవస్థానం నుండి ఫుడ్ తీసుకొచ్చి బయట పడేసి వెళ్లిపోయేవాళ్ళు
డీబీటి ద్వారా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేఈ రోజు నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేస్తాన్నారు
వరద బాధితులకు నష్ట పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం
పావలాది రూపాయిన్నారకి కొన్నారు
కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కలెక్టరేట్ వద్ద బాధితులు ఎందుకు ఆందోళన చేస్తారు.
కేంద్రం దగ్గర నుండి ఏం తెచ్చారు.. మరింత సహకారం కావాలని ఏమైనా అడిగారా?
రీ ఎన్యుమరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
మంత్రులకు అధికారులకు సమన్యాయం లేదు.. దోచుకునే అమౌంట్‌లో లెక్కలు తేలడం లేదు
Comments
Please login to add a commentAdd a comment