( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్‌ఖడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment