
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్– ఆర్‌ఐఎన్‌ఎల్)ను ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బి.సత్యవతి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను ప్రస్తావిస్తూ.. ఆ లేఖలోని అంశాలను కేంద్రమంత్రికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment