
భూమి పూజ చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో మంత్రులు విడదల రజిని, అమర్‌నాథ్ తదితరులు
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అదాని డేటా సెంటర్‌కు త్వరలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి ఆయన బుధవారం ఎండాడ లా కాలేజీ రోడ్డు పనోరమ హిల్స్ వద్ద వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల్లో త్వరలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అవసరమైన సేవలు అందిస్తామన్నారు. న్యాయ పరమైన చిక్కులు తొలిగాక విశాఖ పరిపాలన రాజధాని కానుందని చెప్పారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ మంత్రులు పి.బాలరాజు, దాడి వీరభద్రరావు, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment