
మృతి చెందిన ముర ళీకృష్ణ
రాజంపేట : రాజంపేట బైపాస్‌రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందలూరు బీసీ గురుకుల పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న సురిమశెట్టి మురళీకృష్ణ (60) దుర్మరణం చెందారు. మృతుడు బైకుపై వెళుతున్న తరుణంలో ముందున్న కారు డోర్ తీసి ఉండటంతో డోరు తగిలి కిందపడ్డాడు. వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ అతనిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలోని విజయభాస్కర్ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద సంఘటన స్థలాన్ని రాజంపేట పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయన మృతిపట్ల నాగిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ భూమన శంకర్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment